Wednesday, October 14, 2020

అందరి ప్రార్థనల వల్లే త్వరగా కోలుకున్నా: తమన్నా

కరోనా బారిన పడి కోలుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా చాలా రోజుల తర్వాత ముంబయిలోని తన ఇంటికి చేరుకున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో ఓ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె కరోనా లక్షణాలతో బాధపడ్డారు. దీంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే నగరంలోని ఓ హాస్పిటల్‌లో అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు. Also Read: వారం రోజులకే కోలుకున్నప్పటికీ కొద్దిరోజులు నగరంలోనే హోమ్ క్వారంటైన్‌లో ఉన్న ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో ముంబయికి చేరుకున్నారు. ‘ఇంత తర్వగా కోలుకుంటానని అనుకోలేదు. ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యుల ప్రార్థనలతోనే త్వరగా బమటపడ్డారు. ఇప్పుడు నేనే ఇమ్యునిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తమన్నా తల్లిదండ్రులు కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/378QJ30

No comments:

Post a Comment

'It’s an awesome robot. It looks like a human. People could be easily confused that it’s a human' — Tesla exec on why Optimus 3 is a game changer

Tesla makes big shift to focus on AI and robotics, promising a very human-like Optimus 3 by March — but what does that really mean? from L...