బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖుల జీవితాలను తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తుండగా.. ప్రేక్షకులు సైతం బాగానే ఆదరిస్తున్నారు. మహానటి సావిత్రి బయోపిక్ ఘనవిజయం సాధించడంతో సౌత్‌లో కూడా బయోపిక్‌లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే సౌత్ సూపర్‌స్టార్ జీవిత కథను తెరకెక్కేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. Also Read: ప్రముఖ దర్శకుడు, రజినీకాంత్ అభిమాని అయిన లింగుస్వామి సూపర్‌స్టార్ బయోపిక్ తీసేందేకు సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో రజినీకాంత్‌గా ఆయన పెద్దల్లుడు నటించనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తొలినాళ్లలో బస్ కండక్టర్‌గా పనిచేసిన రజినీకాంత్ కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అపూర్వ రాగన్‌గల్’ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలతో పాటు పలు అమెరికన్ సినిమాల్లోనూ మెరిశారు. సామాన్య వ్యక్తి నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన ఆయన జీవితంలో ఓ సినిమాకు కావాల్సిన మలుపులన్నీ ఉన్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JONPXw
No comments:
Post a Comment