బాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత భార్య షబానా సయీద్‌ను ఆదివారం నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు అరెస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితం సబర్బన్‌లోని జూహూలో గల ఆమె నివాసంలో 10 గ్రాముల గంజాయి దొరికింది. షబానా దాన్ని ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు తేలడంతో ఎన్సీబీ అధికారులు ఆదివారం ఆమెను విచారణకు పిలిచారు. Also Read: విచారణ అనంతరం షబానాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిరాజ్ భార్య షబానాను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద అరెస్టు చేసినట్లు జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడే తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఎన్సీబీ అధికారులు ఫిరోజ్‌ను కూడా రావాల్సిందిగా ఆదేశించినప్పటికీ ఆయన హాజరుకాలేదు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IbjrGq
No comments:
Post a Comment