మారుతున్న కాలానికి తోడు ప్రేక్షకుల తీరు, అభిరుచి అన్నీ మారిపోయాయి. సినిమాల కంటే నటీనటుల మాటల తూటాలు, పంచ్ డైలాగ్స్ చూసి ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు జనం. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ప్రోగ్రాంలో 'అమ్మోరు' ఫేమ్ రచ్చ రచ్చ చేస్తూ హాట్ కామెంట్స్ చేసింది. అందరిముందే అమ్మాయిలు, అబ్బాయిలు.. ఆంటీలు అంటూ అడల్ట్ డైలాగ్స్ వదలడంతో అక్కడున్నవారంతా నోరెళ్లబెట్టారు. ''లో కౌముది, మంగ్లీ, నిఖిల్‌లతో కలిసి సునయన పాల్గొంది. తాజాగా ఈ షో ప్రోమో వీడియో విడుదలైంది. సాయి కుమార్ హోస్ట్‌గా వస్తున్న ఈ షోలో సునయన యమ హుషారుగా కనిపించింది. నిఖిల్‌కి పంచులేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఇందులో భాగంగా 'అబ్బాయిలు ఆంటీలతోనే చెకవుట్ చేస్తారు. వాళ్లకు అమ్మాయిలు అంత ఈజీగా పడరు' అంటూ ఓపెన్‌గా హాట్ కామెంట్స్ చేయడంతో సాయి కుమార్ సహా అంతా షాకయ్యారు. ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: కోడి రామకృష్ణ తెరకెక్కించిన 'అమ్మోరు' సినిమాలో బాలనటిగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది సునయన. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులను అందుకున్న ఆమె దాదాపు 30 సినిమాల్లో నటించింది. అలాగే పలు సీరియల్స్ లోనూ కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచింది. ఇక వివాహం తర్వాత యూబ్యూట్ ఛానెల్ ద్వారా ప్రత్యక్షమై హుషారెత్తించింది. కొద్దిరోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండి.. ఈ మధ్య సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతోంది. ఇటీవల నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ పోషించిన ‘ఓ బేబీ' సినిమా ద్వారా సునయన రీఎంట్రీ ఇచ్చింది. రాజేంద్రప్రసాద్ కూతురిగా ఆమె అద్భుతమైన నటన కనబర్చి ఆకట్టుకుంది. దీంతో సునయనకు వరుసగా ఆఫర్లు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం ఆమె పూరీ ఆకాష్ నటిస్తున్న 'రొమాంటిక్' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2EtCud9
No comments:
Post a Comment