ఒకానొక సమయంలో వెండితెరపై అలరించి ప్రేక్షకలోకాన్ని ఫిదా చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి, హీరోయిన్ .. తిరిగి కెమెరా ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన రీ ఎంట్రీ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది రేణు. ఎమ్.ఆర్. కృష్ణ మామిడాల డైరెక్షన్‌లో రూపొందనున్న ఓ వెబ్ సిరీస్ ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: లేటెస్ట్ సమాచారం మేరకు ఈ మూవీలో ఓ కంపెనీకి సీఈఓగా రేణు దేశాయ్ నటించనుందని తెలుస్తోంది. ఆ కంపెనీ పేరు అని, అదే టైటిల్ ఈ వెబ్ సిరీస్‌కి కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, రేణూదేశాయ్ కూతురు పేరు ఆధ్య అనే సంగతి తెలిసిందే. ఇదే పేరును టైటిల్‌గా పెట్టి సినిమాపై హైప్ తీసుకురావాలనేది దర్శకుడి ప్లాన్ అని తెలుస్తోంది. సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి డిఎస్. రావు, ఎస్. రజినీకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పవన్‌తో విడాకుల అనంతరం కొడుకు అకీరా, కూతురు ఆధ్యలతో లైఫ్ లీడ్ చేస్తున్న రేణు.. రీసెంట్‌గా హైదరాబాద్ వచ్చింది. ఇక్కడే సెటిలై ఇక సినిమాలతో బిజీ కావాలని చూస్తోంది రేణు. మరోవైపు అకీరా సినీ ఎంట్రీపై వార్తలు వస్తుండటం పవన్ అభిమానులను హుషారెత్తిస్తోంది. రైతు నేపథ్యంలో ఓ సినిమా కూడా రూపొందిస్తోంది రేణుదేశాయ్. ఈ సినిమాకు 'అన్నదాత సుఖీభవ' అనే టైటిల్ ఫిక్స్ చేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32XAZ0g
No comments:
Post a Comment