Saturday, September 5, 2020

పవన్ కళ్యాణ్‌పై మాధవీలత ఫైర్.. ముందు ఇళ్లు చక్కబెట్టండి అంటూ సంచలన పోస్ట్

వీర విధేయురాలు, బీజేపీ లీడర్, హీరోయిన్ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. గతంలో మాదిరి పవన్ ఉద్దేశించి మాధవీలత పోస్ట్ అంటే ఆయన్ని ప్రేమిస్తున్నాననో.. లేక ఆయనపై ప్రేమను కురిపిస్తూ పొగడ్తలో కాదు ఈసారి ఘాటైన వ్యాఖ్యలు చేసింది. తొలి నుంచి పవన్ కళ్యాణ్ అంటే విధేయత చూపించే మాధవీలత.. ఆ తరువాత అతనిపై ప్రేమను పెంచుకుని బహిరంగంగా ఆయనకు ప్రేమ లేఖ రాసింది. ‘‘ఎందుకో తెలీదు.. నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను. దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను? ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?’’ అంటూ పవన్‌పై ప్రేమను కురిపిస్తూ అప్పట్లో ప్రేమ లేఖ వదిలింది మాధవీలత. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మరో లేఖ విడుదల చేసింది. తొలి నుంచి పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం ప్రదర్శించే మాధవీలత.. జనసేన స్థాపించిన స్టార్టింగ్‌లో ఆ పార్టీ జెండాలను గట్టిగానే మోసింది. ర్యాలీలలో కూడా పాల్గొంది. అయితే ఆ తరువాత పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు రాలేదో లేక పార్టీ కార్యక్రామాలు నచ్చలేదో కాని.. 2019 ఎన్నికల ముందు బీజేపీ కండువా కప్పుకుని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైంది. అయితే ఆమె బీజేపీలో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అన్నా.. జనసేన అన్నా తన విధేయతను చూపిస్తూనే ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత బీజేపీకి తన మద్దతు ప్రకటించడంతో ‘మీరు వస్తారని నాకు ముందే తెలుసు పవన్ కళ్యాణ్ గారూ.. ఐ లవ్డ్ ఇట్’ అంటూ పవన్ బీజేపీతో దోస్తీ కట్టిన తరుణంలో ఘనంగా స్వాగతం పలికింది మాధవీలత. ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌ని ఎక్కడ ఎవరు ఏమన్నా.. నేనున్నానంటూ ముందుకు వస్తున్న మాధవీలత.. ఇటీవల పవన్ కళ్యాణ్‌పై వర్మ సినిమా తీసిన సందర్భంలోనూ ఘాటుగానే స్పందించింది. ఫర్ ఎవర్ పీకే లవ్స్ వర్మను ఏకిపారేసింది మాధవీలత. ఇక పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని కామెంట్స్ చేసేవాళ్లకి గట్టి కౌంటర్ ఇచ్చింది. పవన్ 3 పెళ్లిళ్లే చేసుకున్నాడు.. రేప్‌లు చేయలేదు అంటూ పవన్ కళ్యాణ్‌ని ఆయన ఫ్యాన్స్‌ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు గట్టిగానే చేసింది. ఇక రీసెంట్ పవన్ బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాలను డెడికేట్ చేస్తూ పోస్టర్స్ విడుదల చేసింది. ‘మా నాయకుడు ఓట్లు అడగమని చెప్పాడు.. కొనమని కాదు’ అంటూ ఆమె నటిస్తున్న ‘సత్యగ్రహి’ సినిమా పోస్టర్‌ను విడుదల చేస్తూ పవన్‌కి విషెష్ అందించింది. అలాగే.. ‘లేడీ’ సినిమా పోస్టర్‌ని కూడా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసింది మాధవీలత. ఇక పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో ముగ్గురు అభిమానులు కరెంట్ షాక్‌తో చనిపోతే.. ఇష్యూలో చాలామంది పవన్ కళ్యాణ్‌ని నిందించడం పట్ల రియార్ట్ అయ్యారు మాధవీలత. పవన్ ఏమైనా ఫ్లెక్సీలు కట్టమన్నారా?? వాళ్ల తలరాత అంతే.. ఇలాంటి పనులు చేయొద్దు జాగ్రత్తగా ఉండాలి కదా’ అంటూ వీడియో విడుదల చేసింది మాధవీలత. అయితే పవన్ కోసం మాధవీలత ఇంత కష్ట పడుతుంటే.. తనని కాదని అటెన్షన్ కోసం బర్త్ డే విషెష్ చెప్పిన వాళ్లందరి మెసేజ్‌లకు పవన్ రిప్లై ఇవ్వడం.. తనను పట్టించుకోకపోవడంపై మాధవీలత డైరెక్ట్ ఎటాక్ చేసింది. గతంలో ఎన్నడూ ఓట్ ఫర్ జనసేన అనని వాళ్లు.. పవన్‌‌ని కామెంట్లు చేసిన వాళ్లు ఈరోజు ప్రేమ కారిపోతూ విషెష్ అందిస్తుంటే.. ఆ కారిన ప్రేమ మీరు బకెట్స్ లో నింపుకోవడం నాకు చాల కోపం తెప్పించింది. మీ నిజమైన అభిమానులకి పెట్టండి రిప్లై’ అంటూ తన బాధను వ్యక్త పరుస్తూ సుదీర్ఘమైన లేఖను పవన్‌ని ట్యాగ్ చేసి వదిలిపెట్టింది మాధవీలత. ‘డియర్ పవన్ కళ్యాణ్.. మీకు ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా డైరెక్ట్‌గా పెట్టలేదు. నేను ఎపుడో కాలేజీ లో ఉన్నపుడు రాసుకున్న ప్రేమ లేఖ తప్ప. డైరెక్ట్‌గా లేఖ రాయలేదు. నా ఫేస్బుక్ వేదికగా రాస్తున్న. అసలు ఎక్కడో నార్త్ స్టేట్స్ నుండి వచ్చి మీరెవరో తెలీకుండా.. తెలుగు ప్రజలకోసం మీరు పడే తపన కష్టం తెలీకుండా.. మీ భావాలు ఏంటో అర్ధం కాకుండా... మీ భాష ఏంటో తెలీకుండా మీ బాధ ఏంటో తెలీకుండా... ఇలా గాలి సోకితే వచ్చి ఇక్కడ నాలుగు సినిమాలు చేసుకుని మళ్ళీ వాళ్ళ ఊరు చెక్కేసే వాళ్ళు... మీ మీద ఎనలేని ప్రేమ గౌరవం ఉందని ఎన్నడూ లేని విధంగా ఈ పుట్టిన రోజు మొక్కలు నాటండి.. కుక్కలు పెంచండి.. ఆవుని పెంచండి.. పాలు తాగండి అని మీ అట్టెన్షన్ కోసం ఎదో వాళ్ళ మేనేజర్స్ మరియు పీఆరోఓలు చెప్తే యాక్షన్ కట్ అన్నట్లు వాళ్ళు చేస్తే అది చూసి మీరు మీ సోషల్ మీడియా వేదికగా వారికి సమాధానం ఇవ్వడం హాస్యాస్పదం. మీరంటే నాకు అభిమానం అది ఎపుడూ పోదు.. అలా అని మీరేం చేసిన రైటో రైట్ అని నేనెపుడు స్టేట్మెంట్స్ పెట్టను. అసలు పోయిన ఏడాది మీరు పోటీ చేస్తుంటే ఓట్ ఫర్ పవన్ కళ్యాణ్ అని ఒక పోస్ట్ పెట్టలేని వాళ్ళు.. జనసేనానిని గెలిపించండి అనలేని వాళ్ళు.. కనీసం మీ మీద ఎన్నో పుకార్లు పుట్టినపుడు I CONDEMN అని పోస్ట్ పెట్టలేని వాళ్ళకి మీ మీద ఈ రోజు ప్రేమ కారిపోవడం ఆ కారిన ప్రేమ మీరు బకెట్స్‌లో నింపుకోవడం నాకు చాలా కోపం తెప్పించింది. మీ నిజమైన అభిమానులకి పెట్టండి రిప్లై. ఇక్కడ సెలెబ్రిటీలకి పెట్టే అవసరమే లేదు... ఎవడికి మీ మీద ప్రేమ లేదు... పైగా మిమ్మల్ని బద్నామ్ చేయాలనీ కొంతమంది నటీమణులు ఛానల్ మెట్లు ఎక్కుతున్నారు.అభిమానం ఉంటే కనీసం వాళ్ళ జీవితంలో మీ కోసం ఒక పోస్ట్ అయినా పెట్టేవాళ్ళు.. మీ జన సైనికులకు పేరు పేరున టైం ఉంటే పెట్టండి. మీరు కాకపోతే మీ పేజీ అడ్మిన్స్ ఎవరో. అంతేతప్ప కెమెరాల కోసం వాళ్ళ పర్సనల్ మ్యానేజర్లు మీ దృష్టిలో పడటం కోసం పెట్టించే వాళ్ళకి మీరు నటిస్తూ ( ఫార్మాలిటీ ) కూడా పెట్టే అవసరం లేదు (upto ur wish). మీరంటే ఎంతో ఇష్టమైన ఒక మాములు అమ్మాయిగా.. నేనెపుడు మీ నుండి ఏమి ఆశ పడలేదు.. జీవితంలో ఎపుడైనా కలిసినా కేవలం ఒక మంచి ఆశయం కోసం.. మంచి విషయం కోసం కలవాలి అనుకున్నా.. అలానే కలుస్తా.. నేను వేరే పార్టీ లో ఉన్న కూడా మీకోసం నేనెపుడు నా గొంతు వినిపించడం లో వెనకడుగు వేయలేదు. మీ మీద అలిగేషన్ చేసిన వాళ్ళు మా పార్టీలోకి వచ్చిన ఇప్పటికి ఒప్పుకోలేకపోతున్నా.. అదీ అభిమానం అంటే. నాకు స్క్రీన్ మీద తప్ప జీవితంలో నటన రాదు. నేనంటే నా పోస్ట్ ఇంతే. అలాగే నా బిజేపీ పార్టీ మీమీద నాకున్న ఇష్టాన్ని అర్ధం చేసుకుంది , అందుకే ఎపుడు అడ్డు చెప్పలేదు. ఇలాంటి అబద్దపు అభిమానులకి మీరు సమాధానం ఇవ్వడం నాకు నచ్చలేదు. ఎవడేమనుకున్నా నాకు అనవసరం ఇది నా భావన మీకు వీలైతే సినిమా ఇండస్ట్రీలో పేరుకున్న చెత్తని కడిగే ప్రయత్నం చేయండి. ప్రజల సంగతి తర్వాత చూద్దురు కానీ ఎలాగూ మిమ్మల్ని గెలిపించలేదు. దానికి టైం ఉంది ఇంకా.. ఇల్లు ( టాలీవుడ్) చక్కదిద్ది.. తర్వాత అమ్మ నా బూతులు తిట్టినా మీరు ప్రజల కోసం పని చేసారు. సినిమా రంగం మీకు అడ్డుపడేంత స్థాయి లేదు.. మిమ్మల్ని తొక్కేంత సీన్ లేదు కనుక.. అక్కడ అమ్మాయిల జరుగుతున్న అత్యాచారాల మీద డ్రగ్స్ మీద పోరాటం మొదలు పెట్టండి. ఆల్రెడీ తెలుగు హీరోలకి తెలుగు రాదు అని దొబ్బులు పెట్టారు కదా పోయిన ఏడాది నాకు బాగా నచ్చింది అలానే చేయండి. కాదు నేను చేయలేను అంటే మీ ఇష్టం “నషా ముక్త్ భారత్“ (DRUGS FREE INDIA)కి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు. జనాలకి చెప్తున్నా నాకు సోషల్ మీడియా వేదికగా సమాధానం రాలేదు అనే కడుపు మంటతో పెట్టాను అనుకునేవాళ్ళకి అసలు నేనెపుడు ఆశ పడలేదు.. కల కనలేదు. నేను ఎపుడు ఒక మంచి కారణం కోసం కలవాలి అని వేచి చూస్తున్న అది అమ్మాయిల జీవితంలో కొంత పోరాటాన్ని ఉత్త్సహాన్ని నింపేదిగా ఉండాలి. My post my report Written by Maadhavi latha pasupuleti.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/320Zjhh

No comments:

Post a Comment

50,000 WordPress site affected in major plugin security flaw - here's how to stay safe

A popular WordPress plugin has a worrying flaw which could allow website takeover. from Latest from TechRadar https://ift.tt/kfKO7nH