గతేడాది 'దిశ' ఘటన దేశవిదేశాలను వణికించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన ఈ ఘటన గురించి తెలిసి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజానీకం ఉలిక్కిపడింది. నలుగురు యువకులు అత్యంత పాశవికంగా దిశను సామూహిక అత్యాచారం చేసి హతమార్చారు. దీంతో ప్రపంచ నలుమూలలా ఈ ఘటన గురించే చేర్చుకున్నారు. ఆ తర్వాత ఆ దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురు యువకులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. తాజాగా ఇదే అంశాన్ని కథగా తీసుకొని తన కొత్త సినిమా ప్రకటించాడు వివాదాస్పద దర్శకుడు . ఓ వైపు అడల్ట్ కంటెంట్ సినిమాలు చేస్తూనే సమాజంలో హాట్ టాపిక్ అవుతున్న క్రైం స్టోరీలను కథలుగా ఎంచుకొని సినిమాలు తీస్తున్నారు వర్మ. లాక్‌డౌన్ వేళ మరింత జోరు పెంచిన ఆయన తాజాగా భయానక ఘటన దిశ గ్యాంగ్ రేప్‌పై 'దిశ ఎన్‌కౌంటర్' మూవీ అనౌన్స్ చేసి ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో దిశ వాడిన స్కూటర్, దానివెనుక లారీ, ఓ వ్యక్తి పారిపోతుండగా గన్‌తో కాలుస్తున్న దృశ్యాలను చూపించి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. Also Read: ఇక ఈ పోస్టర్ తన ట్విట్టర్ వేదికగా పంచుకున్న వర్మ.. ''నవంబర్ 26, 2019న జరిగిన దిశ సామూహిక అత్యాచారం యావత్ భారతదేశాన్ని ఆగ్రహంలో ముంచెత్తింది. ఆ తర్వాత ప్రభుత్వం అత్యాచార చట్టాలను మార్చడమే కాక ప్రపంచంలో మొట్ట మొదటిసారి బాధితుడి పేరు మీద దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. సరిగ్గా ఏడాదికి అనగా అదే నవంబర్ 26వ తేదీ 2020న 'దిశ ఎన్‌కౌంటర్' మూవీ రిలీజ్ కానుంది'' అని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలోని మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యోదంతంపై సినిమా చేస్తున్నారు వర్మ. దానికి ‘మర్డర్’ అని పవర్‌ఫుల్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా గురించి ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Fb2wC0
No comments:
Post a Comment