ఈ ఏడాది సినీ ఇండీస్ట్రీలో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలు యావత్ సినీ లోకాన్ని కలవరపెడుతున్నాయి. ఓ వైపు కరోనా విలయతాండవంలో చిక్కుకొని కొందరు తుదిశ్వాస విడవగా.. అనారోగ్య సమస్యలతో మరికొంతమంది నటీనటులు కన్నుమూయడం సినీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. రెండు రోజుల క్రితమే టాలీవుడ్ కమెడియన్ కోసూరి వేణుగోపాల్ కరోనాతో మరణించారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో కమెడియన్ మరణ వార్త వినాల్సి వచ్చింది. కన్నడ సినిమాలతో ఫేమ్ అయిన కమెడియన్ (64) గుండెపోటుతో కన్నుమూశారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉండగా గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇంతలో మార్గం మధ్యలోనే ఆయన కన్నుమూసినట్లు కన్నడ సినీ వర్గాలు పేర్కొన్నాయి. Also Read: ఇటీవలే రాక్‌లైన్ సుధాకర్ కరోనా బారినపడి కోలుకున్నారు. ఆ తర్వాత ఎంతో చురుకుగా ఉన్న సుధాకర్ గుండెపోటుతో మరణించడం సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సినీ నటులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనతో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 120కి పైగా చిత్రాల్లో రాక్ లైన్ సుధాకర్ నటించారు. తన విలక్షణమైన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mNVbcJ
No comments:
Post a Comment