Thursday, September 24, 2020

SP Balu: బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై సల్మాన్ ఖాన్ ట్వీట్.. ఎంజీఎం ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు

గత 50 రోజులుగా అనారోగ్యంతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో యావత్ సినీ లోకంలో ఆందోళన మొదలైంది. బాలు ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఎంజీఎం ఆసుపత్రికి చాలామంది ప్రముఖులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. మరోవైపు గత రాత్రి నుంచి ఎంజీఎం ఆసుపత్రి వద్దకు భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. గాన గంధర్వుడు కోలుకోవాలంటూ సినీ ప్రముఖులతో పాటు అభిమానులంతా ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. ''మీరు నా కోసం పాడిన ప్రతి పాటకి ధన్యవాదాలు సార్. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీ దిల్ దివానా హీరో ప్రేమ్. లవ్ యూ సార్'' అని పేర్కొంటూ బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు సల్మాన్. 1990వ సంవత్సరంలో సల్మాన్ ఖాన్ చిత్రాల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్‌గా నిలిచి సల్మాన్ కెరీర్‌కి గట్టి పునాది వేశాయి. Also Read: మరోవైపు గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని చాలామంది సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హరీష్ శంకర్, క్రిష్, తమన్, రాధిక, మంచు లక్ష్మి, చిన్మయి, ప్రసన్న, కుష్బూ, గీతామాధురి తదితరులు బాలు ఆరోగ్యం మెరుగుపడాలని పార్దిస్తూ సందేశాలు పోస్ట్ చేశారు. గత 24 గంటల్లో బాలసుబ్రమణ్యం పరిస్థితి బాగా విషమించింది. దీంతో ఎక్మో, వెంటిలేటర్ సహాయంతో గరిష్ఠ స్థాయిలో లైఫ్‌ సపోర్ట్‌ అందిస్తోంది వైద్య బృందం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mMMijE

No comments:

Post a Comment

How to watch A Knight of the Seven Kingdoms — stream Game of Thrones prequel from anywhere

Westeros returns with a smaller, character-driven tale. Here’s how you can watch A Knight of the Seven Kingdoms online and from anywhere. ...