Showing posts with label Cinema news. Show all posts
Showing posts with label Cinema news. Show all posts

Thursday, November 12, 2020

దూసుకుపోతున్న ‘ఆకాశం నీ హద్దురా’... కానీ ఆ విషయంలో ఫీలవుతున్న ప్రేక్షకులు

ఎయిర్ డెక్కన్ సంస్థ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత క‌థతో రూపొందిన ‘’ సినిమా అమెజాన్ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా స్వయంగా నిర్మించారు. ఈ మధ్య కాలంలో ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సూర్య అద్భుతమైన నటన, సుధా కొంగర టేకింగ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. Also Read: ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో ఎన్నో అంచనాలతో విడుదలైన ‘వి’, ‘పెంగ్విన్’ లాంటి సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో సూర్య సినిమాపైనా ఎక్కడో కాస్త ఆందోళన నెలకొంది. అయితే సినిమా బయటికి రాగానే ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. దీనికి తోడు మౌత్ పబ్లిసిటీ కూడా తోడవడంతో ‘ఆకాశం నీ హద్దురా’ అమెజాన్‌ ప్రైమ్‌ దాహాన్ని తీరుస్తోందనే చెప్పాలి. దీపావళి సెలవలు కూడా ఉండటంతో ఈ వీకెండ్ మొత్తం కలుపుకుని ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం.. అదిరిపోయే వ్యూయర్ షిప్ ను నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సినిమా చూసిన వారు ఓ విషయంలో మాత్రం ఫీలవుతున్నారు. అంత మంచి సినిమా థియేటర్లో చూస్తే ఇంకా మజా ఉండేదని, ఆ లోటు మాత్ర తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తన సినిమాలు వరుసగా పరాజయం కావడంతో సూర్య దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మహిళా దర్శకురాలు అన్న ఫీలింగ్ లేకుండా సుధా కొంగర చెప్పినట్లు చేసుకుంటూ పోయారు. నిజంగా చెప్పాలంటే ఇది సూర్య వన్ మ్యాన్ షో. ఇంత మంచి సినిమాను థియేటర్లో పెద్ద తెరపై చూడలేకపోయినా.. దీపావళికి మాత్రం మంచి మజాను ఇచ్చారని మరికొందరు అంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pqqhIE

Wednesday, November 11, 2020

ప్రేమలో పడిన ‘చిన్నారి పెళ్లికూతురు’.. బీచ్‌లో ప్రియుడితో అలా...

‘చిన్నారి పెళ్లికూతురు’గా అందరినీ ఆకట్టుకుని ఆ తర్వాత హీరోయిన్‌‌గా మారింది . తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’తోనే మంచి గుర్తింపు సాధించి ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బరువు పెరగడంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కొంతకాలం బ్రేక్ తీసుకుని ‘రాజుగారి గది 3’తో రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా తాను ప్రేమలో పడినట్లు వెల్లడించింది అవికాగోర్. తన మనసుని దోచుకున్న ప్రియుడిని సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసింది. అయితే పెళ్లి మాత్రం ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం లేదని, ప్రేమ జీవితం ఒక అందమైన అనుభవంలా ఉందంటూ చెప్పుకొస్తూ ప్రియుడితో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఆమె ప్రియుడి పేరు మిలింద్ చద్వానీ. ‘నా ప్రార్థనలకి సమాధానం దొరికింది. నాకు నిజమైన ప్రేమ దొరికింది. మనకు నచ్చిన లక్షణాలున్న వ్యక్తి దొరకడం కష్టమని అనుకుంటాం గానీ నాకు మాత్రం అలాంటి వ్యక్తే దొరికాడు. ఇదంతా ఒక కలలా ఉంది. నేను ఎలాంటి భావనకి గురవుతున్నానో అందరూ అదే అనుభూతిని పొందాలని ఆశిస్తున్నా. ఈ బంధం నా జీవితంలో కీలక పాత్ర పోషించబోతోంది’.. అంటూ అవికా తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేసుకుంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Un9HLm

Tuesday, November 10, 2020

సమంత డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా.. వైరల్ అవుతున్న వర్కౌట్స్ వీడియో

కొద్దిరోజులుగా అక్కినేని వారి కోడలు పేరు మార్మోగిపోతోంది. హీరోయిన్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న సమంత తొలిసారి బిగ్‌బాస్‌ 4కు హోస్ట్‌గా చేసి అందరినీ ఫిదా చేసేసింది. దీంతో పాటు ఆహా యాప్ కోసం ‘సామ్ జామ్’ అనే టాక్ షోని హోస్ట్ చెయ్యబోతున్నట్టు కూడా ప్రకటించింది. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే సమంత గతంలో జిమ్‌లో వంద కేజీల బరువును కూడా అవలీలగా మోసిన వీడియోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. Also Read: ‘సామ్ జామ్‌’ షోతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేందుకు సమంత బాగా కష్టపడుతోంది. దీనిలో భాగంలోనే ఇటీవల ప్లాంట్ బేస్డ్‌ డైట్‌తో పాటు దానికి సంబంధించి వర్కౌట్స్‌ మొదలుపెట్టింది. ట్రైనర్ కృష్ణ వికాస్ పర్యవేక్షణలో సామ్ ఈ కఠిన వ్యాయామాలు చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సమంత డెడికేషన్‌కు, ఫిట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kjl2H7

పవన్ చేతుల మీదుగా ‘గమనం’ ట్రైలర్ లాంచ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న శ్రియ

శరణ్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ సహా పలువురు ప్రముఖ నటీనటులతో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తం ఐదు భాషల్లో సుజన రావు దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, విశేషాలు.. ‘గమనం’పై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం ఉదయం 09.09 గంటలకు విడుదల చేశారు. ఐదు భాషలకు సంబంధించి ఆయా భాషల్లో అగ్రనటులతో ‘గమనం’ ట్రైలర్‌ను లాంచ్ చేయించిన యూనిట్. తెలుగులో పవర్ స్టార్‌ , హిందీలో సోనూసూద్, తమిళంలో జయం రవి, కన్నడలో శివ రాజ్‌కుమార్, మలయాళంలో పహాద్ ఫైసల్.. ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మూడు విభిన్న కథలతో తెరకెక్కిన ‘గమనం’ ట్రైలర్‌ మనసుకు హత్తుకునేలా ఉంది. చెవిటి యువతిగా చంటిబిడ్డతో శ్రియ పడే కష్టాలు, క్రికెటర్‌ కావాలనుకునే ఓ యువకుడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ముస్లిం యువతి, రోడ్డుపై చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరు అనాథ పిల్లల జీవితం.. ఇలా మూడు కథలతో గమనం ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌లో ఓ రోజు రాత్రి కురిసిన భారీ వీరందరి జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందన్నది సినిమాలో చూపించనున్నారు. ‘నాకు వినపడకపోయినా గంట కొట్టి నీకు పూజ చేస్తున్నా.. నీకు వినపడదని నాకేం తెలుసు’ అంటూ శ్రియ చెబుతున్న డైలాగ్ ఆమె పడే కష్టాలను ప్రతిబింబిస్తోంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2K0jky1

‘ఆర్ఆర్ఆర్’కి హ్యాండిచ్చిన ఆలియా.. మరో రెండు వారాలు ఆగాల్సిందే

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్లో ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీడీడీ ఎంటర్‌టైన్స్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. విప్లవ వీరులు కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు జీవితాల స్ఫూర్తితో ఫిక్షనల్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, అల్లూరిగా రామ్‌చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన అల్లూరి, భీమ్ టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కీలక పోరాట సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. సీత పాత్రలో నటించనున్న బాలీవుడ్ నటి నవంబర్ తొలి వారంలోనే సెట్లో అడుగుపెడుతుందని యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పుడామె రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఆలియా ప్రస్తుతం సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘గంగూబాయ్‌ కథియావాడి’ చిత్రంలో నటిస్తోంది. Also Read: ముంబయిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ తొలి వారంలోనే ముగియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్‌ను మరో రెండు వారాలు పొడిగించారట భన్సాలీ. ఈ కారణంగా ఆలియా ‘’ టీమ్‌తో జాయిన్ కావడానికి ఆలస్యమవుతోందని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kkPu3E

‘రాధేశ్యామ్’ షాకింగ్ అప్‌డేట్... క్లైమాక్స్ కోసం రూ.30కోట్లతో సెట్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘’. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. ఇటీవలే ఇటలీలో ఓ షెడ్యూల్‌ పూర్తిచేసుకున్న యూనిట్ ఇండియాకి తిరిగొచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ కోసం సిద్ధమవుతున్నారు. ఇందులో క్లైమాక్స్‌కు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఏకంగా రూ.30కోట్ల ఖర్చుతో ఓ సెట్ వేయనున్నట్లు సమాచారం. హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ ‘రాధేశ్యామ్‌’కి వర్క్‌ చేస్తున్నారు. Also Read: ఆయన పర్యవేక్షణలోనే ఈ సినిమా క్లైమాక్స్‌ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. యూరోప్ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో క్లైమాక్స్‌ భారీ స్థాయిలో చిత్రీకరించాలని దర్శకుడు రాధాకృష్ణ ప్లాన్ చేస్తున్నారు. ఈ కోవలోనే ఆఖరి పోరాట సన్నివేశాల కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేస్తుండటం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35nI9MB

Monday, November 9, 2020

ట్విటర్లో రామ్‌చరణ్ రికార్డు.. ఏ స్టార్‌కూ సాధ్యం కాలేదిది

మెగా పవర్‌స్టార్‌ సోషల్‌ మీడియాలో సరికొత్త రికార్డు సెట్ చేశారు. ట్విటర్లో అతి తక్కువ సమయంలోనే మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న స్టార్‌గా నిలిచారు. ఈ ఏడాది మార్చి నెలలో ట్విటర్లోకి అడుగుపెట్టిన చెర్రీ కేవలం 233 రోజుల్లోనే పది లక్షల ఫాలోవర్లను సొంతం చేసుకోవడం విశేషం. దీంతో ఇంత తక్కువ సమయంలోనే ఈ రికార్డును సాధించిన తెలుగు స్టార్‌గా ఆయన నిలిచారు. తనపై సినిమాలతో పాటు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను చరణ్ ట్విటర్‌ ద్వారా షేర్ చేస్తుంటారు. అయితే ఆయన్ని 10 లక్షల మంది ఫాలో అవుతున్నప్పటికీ చరణ్ మాత్రం కేవలం ఇద్దరిని మాత్రమే ఫాలో అవుతున్నారు. వారు తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్. రామ్‌చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. దీంతో పాటు చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kbMuXj

Sunday, November 8, 2020

బాబాయ్‌తో అబ్బాయ్.. క్రేజీ కాంబో సెట్ చేస్తున్న దగ్గుబాటి ఫ్యామిలీ

సినిమాలో హీరో రెండు ఫైట్లు, నాలుగు పంచ్ డైలాగులు, మూడు పాటల్లో డ్యాన్సులు చేస్తే ఫ్యాన్స్ ఊగిపోతుంటారు. అలాంటిది ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు కనిపిస్తే.. అది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారైతే ఇక ఆ సినిమాకు వచ్చే క్రేజే వేరుగా ఉంటుంది. ఒకే టిక్కెట్‌పై రెండు సినిమాలు చూస్తున్నంత సంబరపడిపోతుంతారు అభిమానులు. అక్కనేని కుటుంబమంతా కలిసి తీసిన ‘మనం’ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ కోవలోనే దగ్గుబాటి హీరోలు కూడా ఒకే తెరపై కనిపించేలా సన్నాహాలు జరుగుతున్నారు. Also Read: ప్రస్తుతం చిరంజీవి - రామ్‌చరణ్‌ కలిసి ‘ఆచార్య’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, రానా కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఆ చిత్రాన్ని వచ్చే యేడాదిప్రకటించబోతున్నారు. ఆ విషయాన్ని రానా స్వయంగా వెల్లడించారు. బాబాయ్‌‌తో కలిసి తాను సినిమా చేస్తున్నానని, స్టోరీతో పాటు మిగతా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయని రానా తెలిపారు. అయితే రానా ‘విరాటపర్వం’ , ‘నారప్ప’ షూటింగుల్లో బిజీగా ఉన్నారు. అవి రెండూ పూర్తయిన తర్వాత ఈ మల్టీస్టారర్‌పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. Also Read: గతేడాది వెంకటేష్, తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీమామ’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే ఈ సారి బాబాయ్-అబ్బాయ్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారన్నమాట. అయితే వీరిద్దరు సినిమాలో కనిపింంచడం ఇదే తొలిసారి కాదు. క్రిష్, రానా కాంబినేషన్లో తెరకెక్కించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలోని ఓ పాటలో వెంకటేష్‌ కాసేపు సందడి చేశారు. మరోవైపు మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం వెంకటేష్‌కు కొత్తేమీ కాదు. మహేశ్‌బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవన్ కళ్యాణ్‌తో ‘గోపాల గోపాల’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2If9NlM

Mohan Lal: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘దృశ్యం2’

కథానాయకుడిగా 2013లోమలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్ లాంటి పెద్ద హీరోలు రీమేక్‌ చేసి అక్కడా విజయం సాధించారు. తాజాగా ఈ సినిమాకు కొనసాగింపుగా దర్శకుడు జీతూ జోసెఫ్‌ ‘’ తెరకెక్కించారు. మోహన్‌లాల్, మీనా జంటగా సెప్టెంబర్ చివర్లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా తాజాగా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాతలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. Also Read: చివరి రోజు యూనిట్ సెట్‌లో తీసుకున్న ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. ఓ వైపు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే పక్కా ప్లాన్‌తో 43రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయడం విశేషం. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్‌ పనులన్నీ పూర్తిచేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని యూని్ తెలిపింది. మరి ఈ సీక్వెల్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3n4Li9R

Saturday, November 7, 2020

కియారా అద్వానీకి బోల్డ్ ప్రశ్నలు.. సె** టాపిక్‌పై మొహమాట పడని యంగ్ హీరోయిన్! ఓపెన్ అయ్యిందిలా..

బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి, అట్టి అంశాల పట్ల స్పందించడానికి ఏ మాత్రం మొహమాట పడటం లేదు నేటితరం యంగ్ హీరోయిన్లు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నలపై నిర్మొహమాటంగా రియాక్ట్ అవుతున్నారు. దీంతో కొందరు నటీమణులు చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ కొన్ని బోల్డ్ ప్రశ్నలపై సమాధానమిచ్చిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్‌లో స్వయం తృప్తి పొందే మహిళగా బోల్డ్ క్యారెక్టర్ చేసిన కియారా అద్వానీ.. నిజ జీవితంలోనూ అంతే బోల్డ్‌గా ఉంటానని నిరూపించింది. తాజాగా జరిగిన ఓ చిట్ చాట్ కార్యక్రమంలో.. మీకు సెక్స్ కంటే ఇష్టమైన మూడు విషయాల గురించి చెప్పండని ఓ నెటిజన్ వేసిన ప్రశ్నపై ఏ మాత్రం తడుముకోకుండా తనకు ఇష్టమైన వాటి గురించి వివరణ ఇచ్చింది కియారా. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. Also Read: సెక్స్ కంటే తనకు పిజ్జా, షాపింగ్, సినిమాలు చూడడం చాలా ఇష్టమంటూ తెలివిగా సమాధానం చెప్పింది కియారా అద్వానీ. 'లక్ష్మీ' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. మొదట 'లక్ష్మి బాంబ్' అని పేరు పెట్టిన ఈ సినిమాకు కొన్ని అభ్యంతరాలు ఎదురుకావడంతో 'లక్ష్మీ'గా పేరు మార్చారు. తెలుగులో వచ్చిన 'కాంచన' సినిమాను దర్శకుడు రాఘవ లారెన్స్ హిందీలో లక్ష్మీగా తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా జంటగా నటించిన ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన ఓటీటీ వేదిక డిస్ని ప్లస్ హాట్ స్టార్‌లో విడుడల చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35aVdVs

Ram Rai: రాయ్ లక్ష్మి తండ్రి కన్నుమూత.. గుండె ముక్కలైందంటూ హీరోయిన్ ఆవేదన

సినీ నటి, హీరోయిన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలుపుతూ తీవ్ర భావోద్వేగానికి గురైంది రాయ్ లక్ష్మి. తన కన్న తండ్రి ఇకలేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపిన ఆమె, తన తండ్రితో గడిపిన జ్ఞాపకాల తాలూకు ఫోటోలు పోస్ట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ''డాడీ ఐ మిస్ యూ.. నేను ఈ బాధను అధిగమించలేను. మిమ్మల్ని బతికించుకోలేకపోయాను. ఈ లోటు తోనే జీవించేందుకు ప్రయత్నిస్తాను. మీరు నన్ను ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించలేదు. మా నాన్న ఇకలేరని చెబుతుంటే నా హృదయం ముక్కలవుతోంది. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనెంతో ప్రయత్నించాను కానీ రక్షించుకోలేకపోయినందుకు క్షమించండి. బంగారు మనసున్న వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆపేసింది.. ఇది నా జీవితంలోనే అంధకారంతో కూడుకున్న సమయం'' అంటూ రాయ్ లక్ష్మి పెట్టిన ట్వీట్ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. రాయ్ లక్ష్మి తండ్రి రామ్‌ రాయ్ కన్నుమూశారని తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతాపం తెలుపుతున్నారు. 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రాయ్ లక్ష్మి.. పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించింది. ఇటీవలే కొన్ని వెబ్ సిరీస్‌‌లు కూడా ఓకే చేసి ఆయా షూటింగుల్లో పాల్గొంటోంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3n3gPsW

Friday, November 6, 2020

వైరల్ అవుతున్న నిధి అగర్వాల్ బాత్రూమ్ సెల్ఫీ.. ఇస్మార్ట్ బ్యూటీ రచ్చ మామూలుగా లేదు బాబోయ్!

ఇస్మార్ట్ బ్యూటీ సోయగాల గురించి ప్రత్యేక వర్ణన అవసరం లేదు. వెండితెరపై అమ్మడి ఒంపుసొంపులు చూసి కుర్రకారు ఫిదా అయిపోయింది. నటనా ప్రతిభకు తోడు ఆకర్షించే అందం ఆమె సొంతం కావడంతో నిధికి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. మరోవైపు మోడ్రన్ దుస్తులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ లుక్స్ పోస్ట్ చేయడం నిధి హ్యాబీ. ఈ క్రమంలోనే తాజాగా బాత్రూమ్ సెల్ఫీ పోస్ట్ చేసి షాకిచ్చింది ఇస్మార్ట్ బ్యూటీ. లాక్‌డౌన్ వేళ సినిమా షూటింగ్స్ లేకపోవడంతో నిధి చేసిన సోషల్ మీడియా రచ్చ అంతా ఇంతా అని చెప్పలేం. వరుసపెట్టి తన ఫోటో షూట్స్ షేర్ చేస్తూ మైమరిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా బాత్రూమ్ సెల్ఫీ పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఈ సెల్ఫీలో సెగలు పుట్టించే అందంతో అట్రాక్ట్ చేస్తోంది నిధి. అలా లో- దుస్తుల్లో నిధిని చూసి ఆమె అందాలను వర్ణిస్తూ నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అయింది. 'మున్నా మైఖేల్' సినిమాతో హీరోయిన్‌గా కెమెరా ముందుకొచ్చిన నిధి అగర్వాల్.. 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌ చిత్రసీమకు పరిచయమైంది. ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకొని క్రేజీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాలో నిధి హీరోయిన్‌గా నటిస్తోంది. అదేవిధంగా యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా 'అల్లుడు అదుర్స్'లో ఐటెం సాంగ్‌తో అదరగొట్టనుందని సమాచారం. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eBOiaB

Kamal Haasan: నటనలో నీకు నువ్వే సాటి.. లేరెవరూ పోటీ.. హ్యాపీ బర్త్‌డే లెజెండ్

విశ్వనటుడు కమల్ హాసన్. ఆయన గురించి ప్రస్తావించడానికి ఇంతకంటే ఏం కావాలి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న సామెతను నిజం చేస్తూ బాలనటుడిగానే తనలోని సత్తాను వెండితెరకు పరిజయం చేసిన ఆయన హీరోగా మారిన తర్వాత తనలోని నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. నటుడిగా ఆయన చేసినన్న ప్రయోగాలు దేశంలో మరే నటుడూ చేయలేదు. నటనలో అరుదైన ప్రయోగాలు చేసిన ఘనత ఆయనది. నటుడిగానే కాకుండా దర్శకుడు, డ్యాన్సర్‌గా, నిర్మాత, స్క్రీన్ రైటర్‌, సింగర్‌, రాజకీయ నేతగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్న పుట్టినరోజు నేడు(నవంబర్ 7). తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని పరమక్కుడి 1954, నవంబర్ 7వ తేదీన జన్మించిన కమల్‌ హాసన్ బాలనటుడిగా నటించిన తొలి సినిమాకు జాతీయ పురస్కారం అందుకున్నాడు. హీరోగా మారిన తర్వాత ‘అవర్‌గళ్’, ‘అవళ్ ఓరు తొడరర్‌కదై’, ‘సొల్ల తాన్ నినైక్కిరేన్’, ‘మాణవన్’, ‘కుమార విజయం’ లాంటి చిత్రాలలో నటించినప్పటికీ శ్రీదేవితో నటించిన ‘16 వయదినిలె’ (తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’) మంచి పేరు తెచ్చిపెట్టింది. శ్రీదేవితో ఆయన ఏకంగా 23 చిత్రాల్లో కలిసి నటించారు. దర్శకుడు కె.బాలచందర్ నిర్మించిన ‘మరో చరిత్ర’ అనే తెలుగు చిత్రంలో నటించి మెప్పించారు. Also Read: మూండ్రంపిరై, నాయకన్ (నాయకుడు), ఇండియన్ (భారతీయుడు) చిత్రాలకు గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని కమల్ హసన్ మూడు సార్లు అందుకున్నారు. సాగర సంగమం, స్వాతి ముత్యం చిత్రాలకుగాను 1983, 1985లలో ఆసియా చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడి పురస్కారం పొందారు. మరో ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డును రికార్డు స్థాయిలో 18 సార్లు సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన ఆరు సినిమాలు భారతదేశం తరపున ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లాయి. దేశంలో మరే నటుడికీ దక్కని గౌరవమిది. 1990లో కేంద్ర ప్రభుత్వం కమల్‌హసన్‌ను ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. 2005లో మద్రాసులోని సత్యభామ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. 2014లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. మూడు దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ హసన్ మొత్తం 171 అవార్డులను సొంతం చేసుకున్నారు. తమిళ సినిమాకు చేసిన సేవలకు గాను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని కలైమామణి (కళాకారుల్లో మాణిక్యం) బిరుదుతో సత్కరించింది. భారతీయ సినిమాను జగద్విఖితం చేసిన ఈ మహానటుడు మరినోని సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ibr5jO

‘వాళ్లకి నడుము చూపిస్తే చాలు’.. దుమారం రేపుతున్న పూజా హెగ్డే వ్యాఖ్యలు

కన్నడ భామ అన్ని భాషల కంటే తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లలో వరుస ఫ్లాపులతో సతమతమైనా ఆ తర్వాత గేర్ మార్చింది. తన అందచందాలతో ప్రేక్షకులను మైమరిపిస్తూ ఇప్పుడు టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం ప్రభాస్, అఖిల్ సినిమాలు చేస్తూ మరికొన్నింటిని లైన్లో పెట్టింది. అయితే తాజాగా ఆమె టాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపేలా కనిపిసిస్తున్నాయి. సౌత్ సినిమా వాళ్లకు హీరోయిన్ల నడుమంటే పిచ్చి అని, వాళ్లను ఎప్పుడూ మిడ్ డ్రెస్‌ల్లోనే చూడాలనుకుంటారంటూ వ్యాఖ్యానించింది. Also Read: పూజా వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో దుమారం రేపుతున్నాయి. నీకు బ్రతుకునిచ్చిన దక్షిణాది ఇండస్ట్రీపైనే నీచపు కామెంట్లు ఎలా చేస్తావంటూ నెటిజన్లు ఆమెను నిలదీస్తున్నారు. నీకు చేతనైతే ఎక్స్‌పోజింగ్ మానేసి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసుకోవాలంటూ హితవు పలుకున్నారు. తెలుగు ఆడియన్స్‌ నీకు స్టార్‌ హీరోయిన్‌ హోదా ఇచ్చినందుకు తగిన గుణపాఠం చెప్పావని, వీలైతే టాలీవుడ్‌ని వదిలి వెళ్లిపో అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. Also Read: నీకు పేరు, హోదా ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీని కించపరిచే బదులు.. బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ సెటిలవ్వు అంటూ కొందరు పూజాను విమర్శిస్తున్నారు. హిందీలో మాత్రం నువ్వేమైనా సాంప్రదాయ పాత్రలు చేస్తున్నావా?.. ఇక్కడి కంటే ఘోరంగా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావంటూ మండిపడుతున్నారు. తనపై వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై పూజా ఇంకా స్పందించలేదు. కాగా, గతంలో కూడా గతంలో తాప్సీ కూడా ఇండస్ట్రీపై ఇలాంటి కామెంట్స్‌ చేసిన సంగతి విదితమే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3l6byjv

సిల్వర్‌ స్క్రీన్‌పై 14ఏళ్ల తర్వాత.. జంటగా సూర్య-జ్యోతిక

సూర్య, జ్యోతిక... వెండితెరపై మోస్ట్ సక్సెస్‌ఫుల్ జంటగా గుర్తింపు పొందిన వీరిద్దరు ప్రేమలో పడి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట ఏడు సినిమాల్లో కలిసి నటించారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఇటీవలే మళ్లీ మేకప్ వేసుకుంటున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ తన సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో , జ్యోతిక మళ్లీ కలిసి నటిస్తే చూడాలన్నది ప్రేక్షకుల కోరిక. దీంతో వాళ్లిద్దరు ఎక్కడికెళ్లినా మళ్లీ కలిసి ఎప్పుడు నటిస్తున్నారు? అంటూ ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. Also Read: ‘కలిసి కనిపించాల్సిన కథ వస్తే మళ్లీ ఆన్‌స్క్రీన్‌ మీద జోడీగా కనబడతాం’ అని సూర్య అనే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ టైమ్ వచ్చినట్లు కనిపిస్తోంది. పద్నాలుగేళ్ల తర్వాత వీళ్లిద్దరూ సిల్వర్ స్క్రీన్‌ మీద మళ్లీ కనిపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. మలయాళ దర్శకురాలు అంజలీ మీనన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందట. తమిళ చిత్రం ‘సిల్లు కరుప్పాట్టి’ దర్శకురాలు హలితా షహీమ్‌తో కలసి అంజలీ మీనన్‌ కథ సిద్ధం చేస్తున్నారని కోలీవుడ్‌తో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈ జంట ఎలా స్పందిస్తారో మరి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eB4vNs

Thursday, November 5, 2020

అలాంటి సినిమాలే చేస్తానంటున్న చెర్రీ... కథలు చెక్కుతున్న రైటర్లు

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్రస్తుతం ‘’ సినిమా షూటింగులో బిజీగా ఉంటూనే.. మరోవైపు మెగాస్టార్ ‘ఆచార్య’లో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు మిగతా హీరోలు ఓ సినిమా చేస్తుండగానే మరో రెండు మూడు ప్రాజెక్టులు లైనులో పెట్టేస్తుంటే మాత్రం నెక్ట్స్ ప్రాజెక్టుపై కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక మంది డైరెక్టర్లు ఆయనకి కథలు వినిపించినా ఏదీ ఫైనల్ చేయలేదు. ‘ఆర్ఆర్ఆర్‌’లో అల్లూరి సీతారామరాజు లాంటి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించాక చరణ్ తర్వాతి సినిమాపై భారీ అంచనాలు నెలకొంటాయన్న సంగతి తెలిసిందే. గతంలో చాలామంది హీరోలు పవర్‌ఫుల్ పాత్రల్లో నటించిన తర్వాత వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న అనుభవం ఉంది. అందువల్ల తాను తర్వాత ఎలాంటి సినిమా చేయాలన్న దానిపై చెర్రీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళితో ‘మగధీర’ లాంటి బ్లాక్‌బస్టర్ అందుకున్న చరణ్ ఆ తర్వాత ‘ఆరెంజ్‌’తో చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాకూడదని ఆలోచనలో పడిన చరణ్ పవర్‌ఫుల్ స్క్రిప్టు కోసం ఎదురుచూస్తున్నాడు. Also Read: పాన్ ఇండియా టార్గెట్‌గా తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ త‌ర్వాత ఆ రేంజ్‌‌కు తగిన క‌థ‌తోనే సినిమా చేయాల‌ని చ‌ర‌ణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన వద్దకు వచ్చిన దర్శకులంతా కమర్షియల్ కథలే వినిపిస్తుండటంతో మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసేస్తున్నాడట. పాన్ ఇండియా సినిమాకు తగ్గ స్క్రిప్టుతో తన దగ్గరకు రావాలని చెబుతుండటంతో కొందరు రచయితలు, డైరెక్టర్లు అందుకు తగిన కథల చెక్కే పనిలో పడ్డారట. గతంలో రామ్‌చరణ్ తమిళ మూవీ ‘తని ఒరువన్’ రీమేక్ ‘ధ్రువ’లో నటించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ‘తని ఒరువన్’ డైరెక్టర్ మోహన్ రాజా సిద్ధం చేసిన కథ చరణ్‌కు తెగ నచ్చేసిందని, ఓకే చెప్పేశాడంటూ కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే దానిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అది రూమర్‌గా భావించాలి. మరి ఈ మెగా పవర్‌స్టార్‌తో సినిమా తెరకెక్కించే లక్కీఛాన్స్ ఎవరికి దక్కుతుందోనని టాలీవుడ్‌లో ఎదురుచూస్తోంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3p5v3LM

విజయ్ పేరుతో రాజకీయ పార్టీ... కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్.. క్లారిటీ ఇచ్చిన హీరో

తమిళనాట సినీనటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. అప్పటి ఎంజీఆర్ నుంచి నేడు కమల్‌హాసన్ వరకు ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న నటులు ఎందరో ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. కొందరు అందులోనూ హీరోలమేనని నిరూపించుకోగా.. మరికొందరు జీరోలుగా మిగిలిపోయారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్ హీరోగా కొనసాగుతున్న దళపతి కూడా రాజకీయాల్లోకి రానున్నారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయితే ఆయన దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్త గురువారం తమిళనాడులో హల్‌చల్ చేసింది. Also Read: విజయ్ తన పార్టీ పేరును కూడా ఎన్నికల సంఘంలో రిజిస్ట్రేషన్ చేయించాడని, పార్టీ వివరాలు త్వరలోనే ప్రకటించనున్నాడన్న వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. విజయ్ కూడా రాజకీయాల్లోకి రానుండటంతో తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని మీడియా కోడై కూసింది. అయితే ఆ వార్తను ఖండిస్తూ కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ పీఆర్వో, ఈవెంట్ మేనేజర్ రియాజ్ కె అహ్మద్ ట్వీట్ చేశారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ ఓ ప్రెస్ నోట్‌ను ట్విటర్లో పోస్ట్ చేశారు. తన తండ్రి చంద్రశేఖర్ రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందని విజయ్ చెప్పినట్లుగా ఆ ప్రెస్ నోట్‌లో విజయ్ పేర్కొన్నాడు. తనకు ఆ రాజకీయ పార్టీతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. తన తండ్రి స్థాపించబోతున్న పార్టీ అన్న ఉద్దేశంతో అభిమానులెవరూ ఆ పార్టీలో చేరవద్దని కోరాడు. ‘విజయ్ మక్కల్ ఇయక్కమ్’ పార్టీ ముసుగులో తన పేరుగానీ, ఫోటోగానీ వాడుకుంటే కఠినచర్యలు తీసుకోవాల్సి వస్తుందని విజయ్ స్వయంగా చెప్పినట్లు ఆ ప్రెస్‌నోట్లో ఉండటం కొసమెరుపు. ఈ ఘటన అటు కోలీవుడ్‌లోనూ, తమిళ రాజకీయ వర్గాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2U03fK8

Wednesday, November 4, 2020

కమల్‌ హాసన్‌ పాత్రలో మెరిసిన రాశి.. ఆ సినిమాలో ముగ్గురు స్టార్ హీరోలు

వెండితెరపై బాలనటిగా అడుగుపెట్టి హీరోయిన్‌గా అనేక మంది హీరోల పక్కన నటించారు రాశి. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తిగా కనుమరుగయ్యారు. అప్పుడప్పుడు చిన్నచిన్న పాత్రల్లో కనిపిస్తున్నా అవన్నీ ఆమె రీఎంట్రీకి సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. అసలు విషయానికొస్తే.. రాశి బాలనటిగా చాలా సినిమాల్లో నటించారు. అలా ఓ హిందీ చిత్రంలో కమల్‌ హాసన్‌ చిన్ననాటి పాత్రలో నటించింది రాశి. Also Read: బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్, తమిళ టాప్ హీరోలు కమల్‌ హాసన్, రజినీ కాంత్‌తో ‘గిరఫ్తార్‌’ సినిమా తెరకెక్కింది. అందులో కమల్‌ హాసన్ చిన్న వయసులోనే తండ్రి చనిపోతే తల్లిని పట్టుకుని ఉండే సన్నివేశం అది. రాశిది చాలా చిన్న వయసు కావడంతో కెమెరా ముందు ఎలా ఉండాలో కూడా ఆమెకు తెలీదు. చుట్టూ ఉన్నవారిని చూసి కంటతడి పెట్టుకుందట. తల్లి పాత్రలో నటిస్తున్న మహిళ ఎత్తుకుంటే అమ్మ కావాలంటూ గట్టిగా ఏడ్చేసిందట. ఎంత బుజ్జగించినా ఏడుపు ఆపకపోవడంతో ఆమె తల్లితోనే ఆ పాత్ర పోషించారు. ‘అలా తన అమ్మ కూడా ఆ సినిమాలో నటించింది’ అని రాశి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32g57TM

దశావతారం, నాన్నకు ప్రేమతో.. ఈ రెండు సినిమాలకు లింకేంటో తెలుసా?

ఏదైనా సినిమాలో హీరో రెండు మూడు పాత్రల్లో నటిస్తేనే ఫ్యాన్స్ అబ్బురంగా చెప్పుకుంటారు. కానీ విశ్వనటుడు కమల్‌ హాసన్ అయితే ‘’ సినిమాలో ఏకంగా పది పాత్రల్లో నటించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. మరోవైపు తండ్రిపై అమితమైన ప్రేమ కలిగిన ఓ కొడుకు ఆయన చివరి కోరిక తీర్చడం కోసం ఓ బిలియనీర్‌తో పోటీపడి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలిపే పాత్రలో ఎన్టీఆర్ ‘’ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఏంటి ఈ రెండు సినిమాలకు ఒకదానికొకటి సంబంధం లేదు కదా.. పొరపాటుగా మాట్లాడుతున్నామనుకుంటున్నారా?. అలాంటిదేమీ లేదు.. ఈ రెండు సినిమాలకు ఓ పోలిక ఉంది. దాని గురించే ఇప్పుడు చెప్పుకుందాం... ఈ రెండు చిత్రాల కథ వేరు, నేపథ్యం వేరు సంబంధం ఏంటి అనుకుంటున్నారా?.. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రెండు చిత్రాల్లోనూ మనకు సీతాకోకచిలుకలు కనిపిస్తాయి. ఎందుకంటే ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌’ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాలు తెరకెక్కించారు. కేవలం బటర్‌ ఫ్లైస్‌ వల్ల జరిగితేనే అది ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌’ కాదు. ఎక్కడో జరిగిన ఓ చిన్న సంఘటన మరెక్కడో పెద్ద సంఘటన జరిగేందుకు దారితీయగలదు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలు తెరకెక్కాయి. Also Read: ‘దశావతారం’లో ఈ ప్రస్తావన ఎక్కువగా లేకపోయినా అంతర్లీనంగా దర్శనమిస్తుంది. ‘నాన్నకు ప్రేమతో’లో హీరో ఎన్టీఆర్‌.. హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌కు దీని గురించి వివరిస్తాడు. ఇలా విభిన్న కథాంశంతో ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రాల రికార్డు ఏంటంటే? ‘బటర్‌ ఫ్లై ఎఫెక్ట్‌’ కాన్సెప్ట్‌ తెరకెక్కిన తొలి భారతీయ సినిమా ‘దశావతారం’, రెండో చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఈ రెండు సినిమాలు దక్షిణాదివే కావడం మరో విశేషం. ఇతర భాషల సినీ ఇండస్ట్రీల కంటే అన్ని విధాలా ఎంతో ముందున్నామని గొప్పలు చెప్పుకునే బాలీవుడ్‌ మాత్రం ఇప్పటివరకు ఈ నేపథ్యంలో ఒక్క సినిమా కూడా తెరకెక్కించలేకపోయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HWKSni

Tuesday, November 3, 2020

ముగ్గురు భామలతో నాగచైతన్య రొమాన్స్!

అక్కినేని , విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో ‘థ్యాంక్యూ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చైతూ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్ ప్రస్తుతం హీరోయిన్లు ఎంపికలో తలమునకలైంది. Also Read: ఇందులో ఓ కథానాయికగా ‘గ్యాంగ్‌లీడర్‌’ ఫేమ్ ప్రియాంక మోహన్‌ ఎంపిక చేసినట్లు సమాచారం. గ్యాంగ్ లీడక్ సినిమా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలోనే తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో ప్రియాంక మంచి మార్కులే కొట్టినప్పటికీ ఆ తర్వాత ఆమెకు అవకాశాలు రాలేదు. దీంతో ఆమెకు విక్రమ్ సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడన్నమాట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/363SqMO

Good news, I found the cheapest large-capacity PCIe Gen4 SSD per TB - bad news, it will cost you more than $58,300

Want the cheapest large capacity PCIe Gen4 SSD per TB? You’ll need to buy ten of Solidigm’s D5-P5336 61.44TB SSD monsters. from Latest fro...