‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలోనే మంచి నటిగా గుర్తింపు సాధించింది. ‘మహానటి’తో అందరి మన్ననలు పొంది అగ్రనటిగా ఎదిగింది. అయితే ఆ తర్వాత ఆమె వేసిన తప్పటడుగులు కెరీర్‌ను ఇబ్బండి పెడుతున్నాయి. కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు వదులుకున్న కీర్తి.. వరుసగా లేడీ ఓరియెంటెడ్ కథలను అంగీకరించింది. దీనికి తోడు ఆ సినిమాలన్నీ ఓటీటీల్లో రిలీజై పరాజయం పాలు కావడంతో ఇప్పుడు బాధపడుతోంది. ఎన్నో అంచనాలతో వచ్చిన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు కీర్తికి చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. Also Read: తాను ఎంతో ఇష్టంగా చేసిన ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి లేడీ ఓరియెంటెడ్ కథలకు స్వస్తి చెప్పి పూర్తిగా కమర్షియల్ సినిమాలే చేయాలని ఫిక్స్ అయిందట. ఇంకో ఐదేళ్ల వరకు ప్రయోగాత్మక సినిమాలే చేయాలని, ఇతర సినిమాలకు ధ్యాస పోనివ్వనని ఈ మహానటి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే సినీ ఇండస్ట్రీతో పాటు ఆమె అభిమానులకు పండగేనని చెప్పాలి. అందం, అభినయం కలబోసిన కీర్తితో సినిమాలు చేసేందుకు అగ్రహీరోల నుంచి యంగ్ హీరోల వరకు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తీసుకున్న నిర్ణయం మంచిదేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం మహేశ్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eKIhsv
No comments:
Post a Comment