వరుస ఫ్లాపులతో డీలాపడిన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. చిత్రలహరి, ప్రతిరోజు పండగే సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఆయన మరో రెండు మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. ఇందులో ‘ప్రస్థానం’ ఫేమ్ దేవా కట్టా సినిమా ఒకటి. ‘ప్రస్థానం’ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. దీంతో మళ్లీ టాలీవుడ్‌నే నమ్ముకున్నాడు. అతడు చెప్పిన కథ నచ్చడంతో సాయిధరమ్ తేజ్ వెంటనే ఓకే చెప్పేశాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కోలీవుడ్ బ్యూటీ నివేదా పేతురాజ్‌ను తీసుకున్నారు. తేజ్, నివేదా... చిత్రలహరి సినిమాలో నటించి మెప్పించారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ చేస్తే సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవుతుందని దేవా కట్టా అనుకున్నాడట. అయితే తాజా సమాచారం ప్రకారం నివేదా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో వరుస ప్రాజెక్టులు ఒప్పుకోవడంతో నివేదా ఈ సినిమాకు డేట్స్ కేటాయించడం కష్టమని చెప్పేసిందట. Also Read: దీంతో ఆమె స్థానంలో తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్‌ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే ఐశ్వర్య బంపరాఫర్ కొట్టినట్లే. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘రిపబ్లిక్’ అనే టైటిల్ పెట్టినట్లు సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ ఇందులో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GrdtAj
No comments:
Post a Comment