ఎయిర్ డెక్కన్ సంస్థ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథతో రూపొందిన ‘’ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా స్వయంగా నిర్మించారు. ఈ మధ్య కాలంలో ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సూర్య అద్భుతమైన నటన, సుధా కొంగర టేకింగ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. Also Read: ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో ఎన్నో అంచనాలతో విడుదలైన ‘వి’, ‘పెంగ్విన్’ లాంటి సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో సూర్య సినిమాపైనా ఎక్కడో కాస్త ఆందోళన నెలకొంది. అయితే సినిమా బయటికి రాగానే ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. దీనికి తోడు మౌత్ పబ్లిసిటీ కూడా తోడవడంతో ‘ఆకాశం నీ హద్దురా’ అమెజాన్ ప్రైమ్ దాహాన్ని తీరుస్తోందనే చెప్పాలి. దీపావళి సెలవలు కూడా ఉండటంతో ఈ వీకెండ్ మొత్తం కలుపుకుని ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం.. అదిరిపోయే వ్యూయర్ షిప్ ను నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సినిమా చూసిన వారు ఓ విషయంలో మాత్రం ఫీలవుతున్నారు. అంత మంచి సినిమా థియేటర్లో చూస్తే ఇంకా మజా ఉండేదని, ఆ లోటు మాత్ర తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తన సినిమాలు వరుసగా పరాజయం కావడంతో సూర్య దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మహిళా దర్శకురాలు అన్న ఫీలింగ్ లేకుండా సుధా కొంగర చెప్పినట్లు చేసుకుంటూ పోయారు. నిజంగా చెప్పాలంటే ఇది సూర్య వన్ మ్యాన్ షో. ఇంత మంచి సినిమాను థియేటర్లో పెద్ద తెరపై చూడలేకపోయినా.. దీపావళికి మాత్రం మంచి మజాను ఇచ్చారని మరికొందరు అంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pqqhIE
No comments:
Post a Comment