ఇటీవల చాలామంది సినీతారలు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఒరవడిని అందిపుచ్చుకుంటోంది మలయాళ బ్యూటీ . హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఆమె కొత్త అవతారమెత్తింది. బ్రీత్: ఇన్‌టు ద షాడోస్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. అది తెలుగులో డబ్ కావడంతో ఇక్కడి ప్రేక్షకులను అలరించింది. అయితే అదే రూట్‌లో నిత్యా ఇప్పుడు తెలుగు వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్నీన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. Also Read: బలభద్రపాత్రుని రమణి అందించిన కథతో గోమ్‌టేశ్ ఉపాధ్యే దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్‌లో నిత్యా మీనన్ నటించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని స్వప్నా దత్ నిర్మించనున్నారట. నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ షో రన్నర్‌గా వ్యవహరిస్తారని సమాచారం. అంటే... స్ర్కిప్ట్ సూపర్ విజన్‌తో పాటు క్రియేటివ్ డెసిషన్లలో పాలు పంచుకుంటారని తెలుస్తోంది. డిసెంబర్ లేదా జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయని సమాచారం. ఇన్నాళ్లూ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన నిత్యా మీనన్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుండటం మంచి పరిణామమే. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IfKK1N
No comments:
Post a Comment