Monday, November 9, 2020

మళ్లీ రిస్క్ చేస్తున్న సునీల్.. కన్నడ రీమేక్‌లో హీరో ఛాన్స్?

స్టార్‌ కమెడియన్‌గా రాణిస్తున్న సమయంలోనే హీరోగా టర్న్ తీసుకున్నారు . ‘అందాల రాముడు’ విజయం సాధించడంతో పూర్తిస్థాయి హీరోగా మారిపోయారు. ఆ తర్వాత పూలరంగడు, మర్యాద రామన్న.. వంటి విజయాలు అందుకున్నా హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. వరుసగా సినిమాలన్నీ ఫ్లాపులు కావడంతో ఆయనకు ఛాన్సులు ఇచ్చేవారే కరువయ్యారు. దీంతో మళ్లీ కమెడియన్‌గా టర్న్ తీసుకున్నప్పటికీ గతంలో మాదిరిగా ప్రేక్షకులను అలరించలేకపోతున్నారు. Also Read: ఈ నేపథ్యంలోనే ఇటీవల వచ్చిన ‘కలర్ ఫోటో’లో విలనిజం చూపించినా అంతగా ఆకట్టుకోలేకపోయారు. కమెడియన్‌ అయిన సునీల్‌ను ప్రతినాయకుడిగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. అయితే కమెడియన్‌గా ఇప్పుడు ఆయనకు మళ్లీ ఆఫర్లు ఊపందుకున్నాయి. ఈ తరుణంలోనే సునీల్ మళ్లీ హీరోగా నటించబోతున్నాడన్న వార్త ఫిల్మ్‌ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. Also Read: కన్నడలో విజయం సాధించిన ‘బెల్‌బాటమ్’ సినిమా తెలుగులో రీమేక్ చేయనున్నారట. కామెడీతో పాటు స్పై తరహా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో రిషబ్ శెట్టి, హరిప్రియ జంటగా నటించారు. ఈ రీమేక్ మూవీలో సునీల్‌ను హీరోగా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితుల్లో సునీల్ మళ్లీ హీరోగా చేసే సాహనం చేస్తాడా? లేదా? అన్నది వేచి చూడాలి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pfvUcA

No comments:

Post a Comment

Good news, I found the cheapest large-capacity PCIe Gen4 SSD per TB - bad news, it will cost you more than $58,300

Want the cheapest large capacity PCIe Gen4 SSD per TB? You’ll need to buy ten of Solidigm’s D5-P5336 61.44TB SSD monsters. from Latest fro...