శరణ్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ సహా పలువురు ప్రముఖ నటీనటులతో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తం ఐదు భాషల్లో సుజన రావు దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, విశేషాలు.. ‘గమనం’పై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం ఉదయం 09.09 గంటలకు విడుదల చేశారు. ఐదు భాషలకు సంబంధించి ఆయా భాషల్లో అగ్రనటులతో ‘గమనం’ ట్రైలర్‌ను లాంచ్ చేయించిన యూనిట్. తెలుగులో పవర్ స్టార్ , హిందీలో సోనూసూద్, తమిళంలో జయం రవి, కన్నడలో శివ రాజ్‌కుమార్, మలయాళంలో పహాద్ ఫైసల్.. ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మూడు విభిన్న కథలతో తెరకెక్కిన ‘గమనం’ ట్రైలర్ మనసుకు హత్తుకునేలా ఉంది. చెవిటి యువతిగా చంటిబిడ్డతో శ్రియ పడే కష్టాలు, క్రికెటర్ కావాలనుకునే ఓ యువకుడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ముస్లిం యువతి, రోడ్డుపై చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరు అనాథ పిల్లల జీవితం.. ఇలా మూడు కథలతో గమనం ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌లో ఓ రోజు రాత్రి కురిసిన భారీ వీరందరి జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందన్నది సినిమాలో చూపించనున్నారు. ‘నాకు వినపడకపోయినా గంట కొట్టి నీకు పూజ చేస్తున్నా.. నీకు వినపడదని నాకేం తెలుసు’ అంటూ శ్రియ చెబుతున్న డైలాగ్ ఆమె పడే కష్టాలను ప్రతిబింబిస్తోంది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2K0jky1
No comments:
Post a Comment