పవర్‌స్టార్ వరుసు సినిమాలు ఒప్పుకుంటూ అటు సినీ ఇండస్ట్రీని, ఇటు ఫ్యాన్స్‌కు సందడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’లో నటిస్తున్న ఆయన ఆ తర్వాత క్రిష్‌తో ఓ సినిమాను చేయనున్నారు. దీనికి తోడు మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్‌కు కూడా ఓకే చెప్పేశారు. ఈ సినిమాకు యువ దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్టర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇందులో మరో హీరోకీ ఛాన్స్ ఉండటంతో.. అందులో ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే దగ్గుబాటి రానా, కన్నడ నటుడు సుదీప్, నితిన్ పేర్లు వినిపించాయి. తాజాగా ఈ పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతితో చిత్ర యూనిట్ సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ‘సైరా’లో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3895xPx
No comments:
Post a Comment