Friday, November 13, 2020

పెళ్లి పత్రికలో జనసేన సిద్ధాంతాలు.. జనసైనికుడి వీరాభిమానం

పెళ్లి పత్రికలో ఎవరైనా బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల పేర్లు ప్రచురిస్తారు. కానీ జనసైనికుల స్టైలే వేరు. ఇతర పార్టీల కార్యకర్తల్లా నాయకులకు జేజేలు కొట్టకుండా.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇందుకోసం వినూత్న పద్ధతులను అవలంభిస్తుంటారు. ఈ కోవలోనే విశాఖ జిల్లా నియోజకవర్గం చిన్ననగమయ్యపాలెం గ్రామానికి చెందిన జన సైనికుడు రాజు తన పెళ్లి పత్రికను కరపత్రంగా మార్చేశాడు. కొండ అనే యువతిని వివాహం చేసుకున్న రాజు... తన వివాహ పత్రిక కవర్ పేజీపై ఓ వైపు విఘ్నేశ్వరుడు, మరోవైపు జనసేనాని పవన్ ఫోటోను పెట్టడంతో పాటు ఆ పార్టీ గుర్తును కూడా ప్రచురించాడు. పత్రిక లోపల పార్టీ సిద్ధాంతాలు కూడా ముద్రించాడు. ‘నా ఆరాధ్య దైవం జనసేనాని శ్రీ ’ గారి ఆశీస్సులతో అంటూ బంధుమిత్రులను తన వివాహానికి ఆహ్వానించాడు. రాజు చేసిన పనికి జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ముచ్చటపడ్డారు. భీమిలి జనసేన పార్టీ నేత సందీప్ పంచకర్ల స్వయంగా రాజు వివాహానికి హాజరై నూతన వధూవరులను అభినందించారు. ఈ విషయాన్ని సందీప్ తన ట్విటర్‌ అకౌంట్లో పోస్ట్ చేశారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kqHWfz

No comments:

Post a Comment

UK strengthens subsea cables against Russian interference

Project Atlantic Bastion is kicking off and should help secure UK undersea critical infrastructure from the Russians. from Latest from Tec...