నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీపై టాలీవుడ్లో భారీ నెలకొన్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు సినీ కెరీర్లో సూపర్‌హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేయగా.. ఈ నెల 15వ తేదీ నుంచి బాలకృష్ణ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. అయిత ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా మలయాళ భామ ప్రయాగ మార్టిన్‌ను తీసుకున్నారు. తెలుగులో ప్రయాగకు ఇదే తొలి సినిమా. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. ఈ జోడీ ఎలాగుంటుందోనని యూనిట్ స్ర్కీన్ టెస్ట్ చేయగా.. బాలయ్య పక్కన ప్రయాగ మరీ చిన్నపిల్లగా కనిపించిందట. దీంతో ఈ జోడీ బాగోలేదని నిర్ధారించుకున్న బోయపాటి ఆమెను ప్రాజెక్టు నుంచి తప్పించారట. దీంతో యూనిట్ మళ్లీ మెయిన్ హీరోయిన్ కోసం వేట ప్రారంభించింది. ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్రకు పూర్ణను ఫైనల్ చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l7WcuT
No comments:
Post a Comment