గ్రీక్ గాడ్‌గా అభిమానులతో పిలిపించుకునే కండల వీరుడు హృతిక్ రోషన్ త్వరలోనే హాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నాడు. బాలీవుడ్‌లో మోస్ట్ స్టైలిష్ హీరోగా కనిపించే హృతిక్‌ను ఎప్పటినుంచో సినిమాలో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడా కోరిక తీరే సమయం వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థకు, హృతిక్‌కు మధ్య చర్చలు జరుగుతున్నాయని బాలీవుడ్ టాక్. దీని కోసం హృతిక్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. Also Read: హాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు హృతిక్ అమెరికాకు చెందిన గెర్ష్ ఏజెన్సీతో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించి హాలీవుడ్‌కు చెందిన ఓ బడా నిర్మాణ సంస్థ ఆయనతో చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చిందని సమాచారం. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుపై హృతిక్ చాలా ఆసక్తి చూపిస్తున్నారట. ప్రస్తుతం ఆయన ఇంటినుంచే అడిషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా ఓకే అయితే ‘క్రిష్-4’ షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TXhtvB
No comments:
Post a Comment