Sunday, November 1, 2020

ఆడవాళ్ల పని అదే.. ముఖేష్ ఖన్నా షాకింగ్ కామెంట్స్.. కంట్రోల్ చేసుకోలేరా అంటూ చిన్మయి ఫైర్

సినీ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక దాడి జరుగుతోందని, అవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నారంటూ ఇప్పటికే ఎందరో నటీమణులు ఓపెన్ అయ్యారు. , క్యాస్టింగ్ కౌచ్ లాంటి ఉద్యమాలు లేవనెత్తి ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెట్టారు. అయితే మహిళలపై లైంగిక వేధింపులు ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు అంతటా ఉన్నాయని కొందరు ఆరోపించగా.. సీనియర్ నటుడు, శక్తిమాన్ ఫేమ్ మాత్రం అందుకు బిన్నంగా మాట్లాడి సంచలనం సృష్టించారు. దీంతో ఎంటరైన ఆయనకు గట్టి కౌంటర్ వేయడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. సమాజంలోని ప్రతి అంశంలో తాము పురుషులతో సమానం అని మహిళలు భావించడం వల్లే మహిళలు లైంగిక దోపిడీకి గురవుతున్నారని, మీటూ అనేది ఎప్పుడైతే ఆడవాళ్లు బయటకొచ్చారో అప్పటినుంచే ఎక్కువైందని పేర్కొంటూ సంచలన కామెంట్స్ చేశారు ముఖేష్ ఖన్నా. ఆడవాళ్లు ఇలా బయటకు రాకుండా, భుజం భుజం రాసుకు తిరగకుండా ఇంటి పని చూసుకుంటే మేలని ఆయన అన్నారు. ఇంటిని చక్కదిద్దుకోవడం మాత్రమే వాళ్ళపని అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. Also Read: ముఖేష్ ఖన్నా చేసిన ఈ వ్యాఖ్యలపై చిన్మయి ఫైర్ అయింది. కొందరి మానసిక పరిస్థితి చూస్తుంటే ఇబ్బందికరంగా అనిపిస్తోందంటూ ఘాటు రియాక్షన్ ఇచ్చింది. అయ్యా.. ముఖేష్ ఖన్నా అంటూ ఆయనపై విరుచుకుపడింది. 'మహిళలు బయటకొచ్చి ఉద్యోగాలు చేయడం కారణంగానే మీటూ ఉద్యమం ప్రారంభమైందని చెప్పిన ఆయన.. పురుషులు తమ కోరికలను అదుపులో పెట్టుకోకపోవడం వల్లనే ఇలాంటివి కొనసాగుతున్నాయని ఎందుకు చెప్పలేకపోతున్నారు' అంటూ సీరియస్ అయింది. మరోవైపు ముఖేష్ ఖన్నా తీరుపై సీనియర్ హీరోయిన్ రాధిక కూడా ఫైర్ అయ్యారు. ఈ మతిలేని, మూర్ఖత్వపు మాటలు వింటుంటే భయంకరంగా అనిపిస్తోందని, ఇలాంటి మాటలకు దూరంగా ఉండడమే మేలని తెలిపారు. ఈ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశం కావడంతో మహిళా లోకం అంతా ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34P2DNC

No comments:

Post a Comment

This ROG Xbox Ally deal might be your last chance at a gift before Christmas — it's almost 20% off on Amazon

Black Friday and Cyber Monday are long gone, but that doesn't mean winter sales are, and the Asus ROG Xbox Ally is fortunately on sale o...