బాలీవుడ్ నటుడు, మోడల్ గోవాలో తెగ హల్చల్ చేస్తున్నారు. గోవా బీచ్‌లో ఇంటిపై నూలు పోగులేకుంగా నగ్నంగా పరుగులు పెట్టి సంచలనం సృష్టించడంతో ఆయనపై పోలీస్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాను నగ్నంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మిలింద్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ అవేవీ పట్టించుకోని ఆయన, తాజాగా తన రెండో భార్యతో అర్ధనగ్నంగా రొమాంటిక్ పోజులిచ్చిన మరికొన్ని పోటోలను పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. నటుడు, మోడల్ మిలింద్, ఆయన భార్య అంకితా కొన్వర్ ప్రస్తుతం గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో భార్య అంకితా కొన్వర్‌తో కలిసి రొమాంటిక్ పోజులిస్తూ కనిపించారాయన. ఈ మేరకు హాయిగా సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ విటమిన్ D స్వీకరిస్తున్నామని పేర్కొంటూ వారిద్దరూ ఆయన ఫోటోలను తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. దీంతో.. కేసు పెట్టినా మిలింద్ సోమన్ తగ్గడం లేదుగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Also Read: ప్రస్తుతం మిలింద్ సోమన్ వయసు 55 సంవత్సరాలు కాగా.. ఆయన భార్య అంకితా కొన్వర్ వయస్సు కేవలం 28 సంవత్సరాలు. తాజాగా వీరిద్దరి ఫోటోలు వైరల్ అవుతుండటంతో ఈ వయసులో మిలింద్ రొమాంటిక్ సంగతులపై నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. పోలీస్ కేసు ఫైల్ అయినా మిలింద్ ఇంకా అలాగే వ్యవహరిస్తుండటం జనాల్లో చర్చనీయాంశం అయింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32kuvYs
No comments:
Post a Comment