బాహుబలి, బాహుబలి-2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన యంగ్ రెబల్ స్టార్ తన తర్వాతి సినిమాలను అందుకు తగినట్లుగానే లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ షూటింగులో బిజీగా ఉన్న ఆయన ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘’లో నటించనున్నాడు. ప్రభాస్ తొలిసారి డైరెక్ట్‌గా నటిస్తున్న తొలి హిందీ చిత్రం ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ మేకర్స్ ప్రభాస్ కోసం హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు. ఇందులో ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుండి మొదలుకానుంది. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా, సైఫ్ రావణుడి రోల్ పోషించబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి రాముడి పాత్రలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందోదనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. Also read: రాముడిగా ప్రభాస్‌ని ఊహించుకుంటూ ఇప్పటికే అనేక ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ వచ్చాయి. తాజాగా ఓ అభిమాని రాముని గెటప్ లో ప్రభాస్ లుక్ ఇలా ఉంటుందంటూ యానిమేషన్‌లో తయారు చేసి పోస్ట్ చేశాడు. సముద్ర తీరంలో సిక్స్ ప్యాక్ బాడీతో సీరియస్ లుక్‌లో రాముడిగా ప్రభాస్ లుక్ అదిరిపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ లుక్‌ను సోషల్‌మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ లుక్‌పై స్పందించిన చిత్ర దర్శకుడు ఓం రౌత్ దీన్ని రీ ట్వీట్ చేస్తూ... ‘ఈ లుక్ చూసి స్టన్ అయ్యాను.. మీకు చాలా శక్తి ఉంది’ అంటూ కామెంట్ చేశారు. Also read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U8cIPQ
No comments:
Post a Comment