సినీ నటి, హీరోయిన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలుపుతూ తీవ్ర భావోద్వేగానికి గురైంది రాయ్ లక్ష్మి. తన కన్న తండ్రి ఇకలేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపిన ఆమె, తన తండ్రితో గడిపిన జ్ఞాపకాల తాలూకు ఫోటోలు పోస్ట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ''డాడీ ఐ మిస్ యూ.. నేను ఈ బాధను అధిగమించలేను. మిమ్మల్ని బతికించుకోలేకపోయాను. ఈ లోటు తోనే జీవించేందుకు ప్రయత్నిస్తాను. మీరు నన్ను ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించలేదు. మా నాన్న ఇకలేరని చెబుతుంటే నా హృదయం ముక్కలవుతోంది. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనెంతో ప్రయత్నించాను కానీ రక్షించుకోలేకపోయినందుకు క్షమించండి. బంగారు మనసున్న వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆపేసింది.. ఇది నా జీవితంలోనే అంధకారంతో కూడుకున్న సమయం'' అంటూ రాయ్ లక్ష్మి పెట్టిన ట్వీట్ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. రాయ్ లక్ష్మి తండ్రి రామ్ రాయ్ కన్నుమూశారని తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతాపం తెలుపుతున్నారు. ఇటీవలే 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రాయ్ లక్ష్మి.. పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించింది. ఇటీవలే కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా ఓకే చేసి ఆయా షూటింగుల్లో పాల్గొంటోంది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n3gPsW
No comments:
Post a Comment