Monday, November 2, 2020

RRR: ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్.. ఇద్దరు భామలతో యంగ్ టైగర్ ప్రేమాయణం

దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ . యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ ఫినిష్ కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్‌తో పాటు సీనియర్ హీరోయిన్ శ్రీయను కన్ఫర్మ్ చేసిన జక్కన్న.. తాజాగా మరో హీరోయిన్‌ని కూడా ఫైనల్ చేశారట. చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తున్నారు. అయితే కథ ప్రకారం ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్‌కి స్కోప్ ఉండటంతో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్‌ని తీసుకున్నారట రాజమౌళి. కొమరం భీమ్‌ను ప్రేమించే గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్య కనిపించనుందని టాక్. ఈ పాత్ర పరిధి తక్కువైనా, కథకు ఎంతో కీలకమని అంటున్నారు. ఈ మేరకి ఇప్పటికే ఐశ్వర్యతో సంప్రదింపులు ఫినిష్ అయ్యాయని సమాచారం. మరోవైపు ఈ భారీ సినిమాలో అజయ్ దేవ్‌గణ్‌కు జంటగా శ్రియ నటిస్తోంది. ఐరిష్‌ అందాల భామ అలిసన్‌ డూడి లేడీ స్కాట్‌ పాత్రలో విలన్‌గా నటిస్తున్నారు. మొత్తంగా ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల జీవిత కథకు తనదైన కాల్పినికత జోడించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు జక్కన్న. ఇటీవలే విడుదలైన ఎన్టీఆర్ టీజర్ పలు వివాదాల్లో చిక్కున్నప్పటికీ భారీ ఆదరణ పొంది సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. డీవీవీ దానయ్య సమర్పణలో 400 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి ఈ మూవీ రూపొందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mLKIO7

No comments:

Post a Comment

Someone finally tested China's x86 CPU answer to AMD and Intel — the 8-core Zhaoxin KX-7000 processor is promising, but can't reasonably compete for now

The 8-core Zhaoxin KaiXian KX-7000 processor, China’s latest entry into the x86 CPU market, was recently put through its paces by PC Watch ...