Friday, December 27, 2019

‘‘మామనయ్యాను.. ఇక తండ్రిని కావాలనుకుంటున్నాను’’

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు పెళ్లి యోగం లేదని ఈపాటికే అందరికీ అర్థమైపోయింది. దాంతో ఇక అభిమానులు కూడా ఆయన పెళ్లి గురించి ఆలోచించి విసిగిపోయి ఉంటారు. పెళ్లి సంగతి అటుంచితే.. సల్మాన్‌కు తండ్రి అవ్వాలని ఉందట. నిన్న సల్మాన్ 54వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఆ రోజున సల్మాన్‌కు జీవితంలో మర్చిపోలేని కానుక దొరికింది. తన సోదరి అర్పితా ఖాన్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అంతకుముందే అర్పితకు కుమారుడు ఉన్నాడు. దీని గురించి సల్మాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా చెల్లెలు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు ఆయత్ శర్మ అనే పేరు పెట్టాం. నా పుట్టినరోజు నాడు ఉదయం లేవగానే ఆ చిట్టితల్లి ముఖం చూశాను. అది బెస్ట్ విషయం. ఇక ప్రతీ డిసెంబర్ 27న నా మేనల్లుడు, మేనకోడలితో కలిసి బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంటా. నేను మామనయ్యాను, బాబాయిని అయ్యాను. ఇక తండ్రిని అవ్వడం మాత్రమే మిగిలుంది’’ అని వెల్లడించారు. READ ALSO: సల్మాన్‌కు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. తన చెల్లెలి కొడుకుతో కలిసి సల్మాన్ ఆడుకోని రోజంటూ లేదు. ఇంట్లో ఉంటే వాడితోనే ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటాడు. వీలైనప్పుడల్లా అనాథ పిల్లలకు, పేద పిల్లలకు సాయం చేస్తుంటాడు. జీవితంలో ఏ అమ్మాయినీ పెళ్లి చేసుకుని మంచి భర్తను అనిపించుకోలేను కానీ మంచి తండ్రిని అనిపించుకోగలను అని చాలా సార్లు చెప్పారు. మరి కరణ్ జోహార్, సన్నీ లియోన్ లాగా సల్మాన్ కూడా సరోగసీ పద్ధతి ద్వారా పిల్లల్ని కంటారేమో చూడాలి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3527GqY

No comments:

Post a Comment

Google has just announced the ability to chain actions in Gemini and it could change the way we use AI for good

Gemini can now chain actions together to complete complex tasks Gemini Live is gaining multimodal abilities on the newest phones Gemini...