Friday, December 27, 2019

Mahesh Babu: బ్రేక్‌ తీసుకున్న మహేష్‌.. న్యూ ఇయర్‌ వేడుకలకు పయనం!

సూపర్‌ స్టార్‌ షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలికి ఎంతో ఇంపార్టెన్స్‌ ఇస్తాడు. అందుకే ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఏ చిన్న అకేషన్‌ వచ్చినా ఫ్యామిలితో కలిసి ఫారిన్‌ టూర్‌లు వెలుతుంటాడు. ఏడాదిలో కనీసం మూడు నాలుగు సార్లు ఇలాంటి హాలీడే ట్రిప్స్‌కు వెళ్లటం మహేష్ ఫ్యామిలీకి అలవాటు. అందుకే మహేష్ సినిమాలు కూడా కాస్త నెమ్మదిగానే చిత్రీకరణ జరుగుతుంటాయి. తాజాగా సినిమా పనులకు బ్రేక్‌ ఇచ్చి వెకేషన్‌కు చెక్కేస్తున్నాడు సూపర్‌ స్టార్‌. ఈ సారి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఫ్యామిలీతో కలిసి యూరప్‌ వెళుతున్నాడు మహేష్. ఇప్పటికే సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేసిన మహేష్ బాబు హాలీడేస్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. Also Read: వారం రోజుల పాటు యూరప్‌లో గడిపేలా ప్లాన్ చేసుకున్నాడు సూపర్‌ స్టార్‌. జనవరి 3న మహేష్ తిరిగి ఇండియాకు వస్తాడని తెలుస్తోంది. తరువాత సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొననున్నాడు. ఎల్బీ స్టేడియంలో భారీగా నిర్వహించనున్న ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌ ఒకే వేదిక మీదకు వస్తుండటంతో ఈ వేడుకకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ సినిమాతో చాలా కాలం తరువాత సీనియర్‌ నటి విజయశాంతి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారు. కామెడీ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మి అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37fwGMT

No comments:

Post a Comment

I like the Nothing Phone 3, but I love the company's Headphones 1 – they're my top tech of 2025 (so far)

Can anyone look at the Nothing Headphone 1 for the first time without cracking a smile? It was the talk of TechRadar's Sydney office wh...