మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ల గురించే ఇండస్ట్రీ చర్చ. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబులతో ఇప్పటికే త్రివిక్రమ్ చేయబోయే సినిమాలు ఖరారయ్యాయి. అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో కూడా త్రివిక్రమ్ సినిమా చేయనున్నట్టు వదంతులు వచ్చాయి. నిజానికి ఈ సినిమానే త్రివిక్రమ్ మొదట మొదలుపెట్టబోతున్నారని టాక్. అయితే, రామ్ ప్రాజెక్ట్ గురించి వదంతులు తప్ప ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఎన్టీఆర్ RRR సినిమాతో బిజీగా ఉండటంతో ఆయనతో త్రివిక్రమ్ షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఇప్పట్లో ఉండవు. కాబట్టి, ఈ లోపల రామ్‌తో సినిమాను పూర్తి చేద్దామని త్రివిక్రమ్ నిర్ణయం తీసుకున్నట్టు రూమర్లు వ్యాపించాయి. అంతేకాదు, ఈ సినిమాలో రామ్‌కు జోడీగా అనుపమా పరమేశ్వరన్‌ను త్రివిక్రమ్ తీసుకోబోతున్నట్టు టాక్. కానీ, ఈ లోపల మరో రూమర్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. త్రివిక్రమ్‌కు సూపర్ స్టార్ ఒక రిక్వెస్ట్ చేసినట్టు వదంతులు వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తరవాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించనున్నారు. కానీ, ఈ సినిమా వచ్చ ఏడాది కూడా సెట్స్‌పైకి వెళ్తుందో లేదో తెలీదు. ఒకవేళ రాజమౌళి దర్శకత్వంలో సినిమా ప్రారంభమైతే మహేష్ మరో ప్రాజెక్ట్ వైపు చూసే ఛాన్స్ ఉండదు. అందుకే, ఆ సినిమా మొదలయ్యే లోపు త్రివిక్రమ్‌తో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని మహేష్ చూస్తున్నారట. ‘సర్కారు వారి పాట’తో సమాంతరంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా కూడా చేయాలని మహేష్ నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్నే ఆయన త్రివిక్రమ్‌కు కూడా చెప్పారని టాక్. మరి రామ్‌తో ముందు సినిమా చేయాలనుకున్న త్రివిక్రమ్.. మహేష్ రిక్వెస్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి ఈ వదంతుల్లో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34QekE9
No comments:
Post a Comment