దిగ్గజ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు ఓ ఇంటివాడయ్యారు. హిమబిందు లక్ష్మిని ఆయన నిన్న (అక్టోబర్ 31న) పెళ్లాడారు. రాజా, హిమబిందు వివాహ వేడుక చాలా తక్కువ మంది అతిథులు, కుటుంబ సభ్యుల మధ్య మాదాపూర్లోని ఓ స్టార్ హోటల్లో జరిగింది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, వంశీ పైడిపల్లి, శ్రీకాంత్ నాగోతి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వాదించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఆప్తుడు అయిన త్రివిక్రమ్ సంప్రదాయ షేర్వాణి ధరించి పెళ్లికి హాజరయ్యారు. షేర్వాణి రంగుకు మ్యాచ్ అయ్యేటట్టు మాస్క్ కూడా డిజైన్ చేయించుకున్నారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పెళ్లి వేడుకను నిర్వహించారు. చాలా తక్కువ మంది అతిథులు, శానిటైజర్స్, మాస్క్లు, భౌతిక దూరం పాటించారు. కాగా, తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను రాజా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అని విడివిడిగా ఫొటోలను పోస్ట్ చేశారు. తెలుపు రంగు షేర్వాటి, దానిపై కోటు ధరించిన రాజా.. ఆ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఇక హిమబిందు పట్టుచీర, బంగారు ఆభరణాలు ధరించారు. ఫొటోల్లో హిమబిందు చాలా హుషారుగా కనిపిస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం జీలకర్ర బెల్లం పెట్టించిన తరవాత మూడు ముళ్ల బంధంతో రాజా, హిమబిందు ఒక్కటయ్యారు. కాగా, ఆగస్టు 15న రాజా, హిమబిందుల నిశ్చార్థం జరిగింది. ఈ విషయాన్ని రాజానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే, తనకు కాబోయే భార్య పేరు హిమబిందు లక్ష్మి అని ఆరోజు రాజా వెల్లడించలేదు. ఇప్పుడు పెళ్లి సందర్భంగా తన అర్థాంగిని పరిచయం చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఇద్దరు కుమారుల సంతానం. పెద్ద కుమారుడు రాజా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రెండో కుమారుడు యోగేశ్వర్ శర్మ సంగీత దర్శకుడిగా ప్రయత్నిస్తున్నారు. రాజా ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. ‘ఎవడు’, ‘ఫిదా’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘అంతరిక్షం’, ‘మిస్టర్ మజ్ను’, ‘రణరంగం’, ‘చాణక్య’, ‘ఇద్దరి లోకం ఒకటే’, ‘భానుమతి & రామకృష్ణ’ వంటి సినిమాల్లో నటించారు. రాజా మంచి నటుడే అయినా ఇంకా సరైన గుర్తింపు ఆయనకు రాలేదు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34Jy9g0
No comments:
Post a Comment