చాలా రోజుల తరవాత ఒక చిన్న సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి ప్రధాన కారణం నేచురల్ స్టార్ నాని. ఆయన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా నిర్మాణంలో వస్తోన్న చిత్రం కావడంతో ‘హిట్’ సినిమాకు మంచి పాపులారిటీ వచ్చింది. దీనికి తోడు ప్రచార కార్యక్రమాలను కూడా బాగా నిర్వహించడం ప్లస్ అయ్యింది. రాజమౌళి, అనుష్క, రానా వంటి వాళ్లతో ప్రమోట్ చేయించి సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చారు నాని. మరోవైపు, ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఈ చిత్రంలో హీరోగా నటించడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్’ మూవీ భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమైపోయాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ చాలా బాగుందని అంటున్నారు. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు కట్టిపడేశారట. చాలా బాగా ఎంగేజ్ చేశారని చెబుతున్నారు. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేశారట. విశ్వక్‌సేన్ చాలా బాగా నటించాడని అంటున్నారు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయని కొంత మంది ట్వీట్లు చేస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేసే సన్నివేశాలు చాలానే ఉన్నాయట. ఇంటర్వెల్‌లో వచ్చే ఓల్డ్ సిటీ ఛేజ్ సీన్ అయితే చాలా బాగుందని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సినిమా చాలా ఎంగేజింగ్‌గా ఉందని ట్వీట్లు చేస్తున్నారు. అయితే, థ్రిల్లర్ జోనర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు అంత థ్రిల్ ఏమీ ఇవ్వలేకపోయారని అనే వాళ్లు కూడా ఉన్నారు. ఫస్టాఫ్‌ను చిన్న చిన్న సర్‌ప్రైజ్‌లతో నడిపించారని.. సెకండాఫ్ సినిమాను నిలబెట్టిందని చెబుతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cfzrRJ
No comments:
Post a Comment