మెగాస్టార్ చిరంజీవికి ఊహించని షాక్ ఇచ్చింది సీనియర్ హీరోయిన్ . కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘’ నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించింది. మెగాస్టార్ సినిమాలో నటించేందుకు కుర్రహీరోయిన్స్ కూడా రెండో ఆలోచన లేకుండా సై అంటుంటారు. ఆయన సినిమా ఒక్క ఫ్రేమ్‌లో కనిపించినా చాలని సంబర పడుతుంటారు అలాంటిది.. చిరంజీవి హీరోగా, కొరటాల లాంటి అగ్రదర్శకుడు సినిమా నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో చెప్తూ ట్వీట్ చేసింది త్రిష. ‘క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల చిరంజీవి సార్.. చిత్రం నుండి తప్పుకుంటున్నా.. మనకు చెప్పేది ఒకటి అక్కడ జరుగుతుంది ఒకటి.. కొన్నిసార్లు మనకు చెప్పిన విషయాలు, మనతో చర్చించినవి క్రియేటివ్ డిఫరెన్సెస్‌లో జరగకపోవచ్చు. ఇలాంటి విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ చిత్ర యూనిట్‌కి మంచి జరగాలని కోరుకుంటున్నా. నన్ను అభిమానించే తెలుగు ప్రేక్షకులకోసం మరో మంచి చిత్రంతో మీ ముందుకు వస్తా’ అంటూ ట్వీట్ చేసింది త్రిష. అయితే త్రిష ఈ చిత్రం నుండి తప్పుకోవడం వెనుక.. మహేష్ బాబు పక్కన నటించే హీరోయిన్‌తో వచ్చే కంపారిజన్ అని తెలుస్తోంది. మహేష్ పక్కన యంగ్ హీరోయిన్‌ని తీసుకుంటుండగా.. గతంలో మహేష్ పక్కన ‘అతడు’ ‘సైనికుడు’ తదితర చిత్రల్లో మహేష్ సరసన నటించిన తాను.. పెద్ద తరహాలో మెగాస్టార్ పక్కన నటిస్తే ఫ్యూచర్‌లో తన కెరియర్‌కి ఇబ్బంది వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే మరి గతంలో ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవితో జోడీ కట్టింది త్రిష. మరి అసలు విషయం ఏంటన్నది తెలియాల్సి ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WcyfJa
No comments:
Post a Comment