Wednesday, September 30, 2020

‘ధృవ’సీక్వెల్‌పై‌ రూమర్స్.. రామ్‌చరణ్ ఆలోచన ఏంటి?

మెగా పవర్‌స్టార్ కెరీర్లో ‘ధృవ’ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో ఆయన ఇమేజ్ భారీగా పెరిగింది. తమిళంలో జయం రవి నటించి... అతని సోదరుడు మోహన్‌ రాజ్‌ తెరకెక్కించిన ‘తని ఒరువన్‌’ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీనికి డైరెక్టర్ సురేందర్‌రెడ్డి కొన్ని మార్పులు చేసి తెలుగులో తెరకెక్కించారు. రామ్‌చరణ్ స్టైల్, యాక్షన్‌కు తోడు అరవిందస్వామి విలనిజంతో ఈ సినిమా తెలుగులోనూ భారీ విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆ జయం రవి, అతడి సోదరుడు ‘తని ఒరువన్‌-2’ తెరకెక్కించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలవుతుందిన కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జయం రవి ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఆ షూటింగ్ జనవరికల్లా పూర్తి చేసుకుని ఫిబ్రవరి నుంచి ‘తని ఒరువన్‌-2’ కోసం రంగంలోకి దిగాలని ప్లాన్ చేసుకున్నారట. దీంతో తెలుగులోనూ ‘ధృవ-2’ తీస్తారా? అందులో రామ్‌చరణ్ నటిస్తారా? లేదా? అని ఫిల్మ్‌నగర్‌లో చర్చ నడుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kZ4sNm

No comments:

Post a Comment

The funky JBL Go 4 is back to its lowest price this year

A great deal for a budget-friendly four-star Bluetooth speaker from Latest from TechRadar https://ift.tt/utqFIHd