Sunday, September 27, 2020

'క‌ష్టం, న‌ష్టం, దుఃఖం మూడింటా మ‌ళ్లీ ఓడిపో.. పూరి'

ఇండస్ట్రీలో బాగా దెబ్బతిన్న డైరెక్టర్ ఆయనే.. బాగా ఫేమ్ అయిన దర్శుకుడు ఆయనే.. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే తిరిగి సక్సెస్ వెతుక్కుందీ ఆయనే. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఆయనెవరో. మీరు ఊహించింది నిజమే.. ఆయనే డాషింగ్ డైరెక్టర్ . స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్‌ హిట్లిచ్చినా సింపుల్‌గా ఉండే ఆయన ఈ రోజు తన 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా పూరిపై తన మనసులోని భావాలను పంచుకుంటూ ఓ ఇంట్రెసింగ్ పోస్ట్ పెట్టారు కవి, శ్రీకాకుళం వాసి ర‌త్న‌కిశోర్ శంభుమహంతి. పూరి కోసం ఆయన రాసిన పోస్ట్ ఉన్నది ఉన్నట్లుగా.. ఎన‌ద‌ర్ రాగా: ఈ గుండె స‌డి వినిపిస్తుందా.. మిస్ట‌ర్ పూరీ. కొడ్తే దిమ్మ దిరిగి ప‌డిపోవ‌డం వెరీ సింపుల్. హీరో క‌దా అలానే అంటాడు.. నేను లోక‌ల్ నేను ప‌వ‌ర్ ఫుల్ అని చెప్ప‌డం వెరీ సింపుల్. వెనుక ఎవ‌రో ఉండి అరిపిస్తున్న మాట. అనిపిస్తున్న మాట ఆ విరుపూ ఆ చరుపూ.. ఆ చుర‌క‌త్తి చూపూ కొన్నాళ్లే కొంత వ‌ర‌కూ మాత్ర‌మే. ఓ అభియోగం ఓ ప‌రాభ‌వం ఆ ప్రాభవాన్ని ప్ర‌శ్నిస్తే.. మ‌నిషి మ‌ళ్లీ ప‌డి లేవాలి లేదా ప‌డిన చోటే ఉండిపోయి కొత్త చేయూత కోసం అర్థించాలి. ఈ రంగుల రోడ్డు ఆ డ్ర‌స్సు కోడూ అన్నీ అన్నీ నీ ప‌త‌నాన్ని అరిచి వినిపిస్తాయి.. కానీ నేనున్నా అన్నమాట ఎవ్వ‌డూ అన‌డు అనిపించ‌డు. దిగ్భ్ర‌మ అంటే ఇదే.. భ్ర‌మ‌నో/బ్రాంతినో వ‌ద్ద‌నుకోవ‌డం త‌గ‌ని ప‌ని! ఏది ఎలా ఉన్నా స్వీక‌రించ‌డం చేయాల్సిన ప‌ని! వాటి దూరంగా జ‌రిగేందుకు కాస్త కృషి చేయ‌ద‌గిన ప‌ని. పూరీ అదే చేస్తున్నారు. తన పుట్టిన రోజున క‌ష్టంలో ఉన్న కొంద‌రిని (ద‌ర్శ‌కుల‌నూ - స‌హాయ ద‌ర్శ‌కుల‌నూ) ఆదుకునే ప్ర‌య‌త్నం ఒక‌టి చేస్తున్నారు. (సెప్టెంబ‌ర్ 28)..హ్యాపీ బ‌ర్త్ డే స‌ర్ .. ప్ర‌భు ధ‌ర్మం వ్య‌తిరేకించాల‌ని అనుకుంటాను. ప్రాభ‌వ రూపాల‌ను వ‌ద్ద‌నుకుంటాను. ఈ వేళ నీవు న‌చ్చ‌డం లేదు.. నీవు ఎవ్వ‌రికీ కానీ వేళ అస్స‌లు న‌చ్చ‌లేదు.. ఇలా అనుకున్నాను మొన్న‌టి వ‌రకూ నిన్న‌టి వ‌రకూ, ఈ క్ష‌ణం వ‌ర‌కూ. ఆక‌లికి అర్థం వెతుక్కోవడం ఆ ఫిల్మ్ న‌గ‌రి దారుల చెంత ఉన్న వారికి తెల్సునో/లేదో ఇంకా ఇంకొంద‌రు ప‌ట్టెడు ప్రేమ కోస‌మే ఎదురు చూస్తున్నారు. నా సాయాన్ని మీరు తీసుకోండి.. అది చాలా చిన్న‌దే అంటున్నారే. చాలా న‌చ్చిందీ మాట. కొన్ని వేల పుట్టిన రోజుల‌కూ క్ష‌ణాల‌కూ కూడా ద‌క్క‌ని భాగ్యం ఈ రోజు ఇచ్చారు. మీ సినిమా ఏమ‌యినా ఇప్పుడు మేం ప‌ట్టించుకోం. అస‌లీ సినిమా అనే ప్ర‌పంచం నుంచి మీరు వెళ్లిపోయినా అది కూడా ఏమంత పెద్ద విష‌యం కాదు. ఆక‌లితో ఉన్న‌వారికి లేదా ఆక‌లి క‌న్నీరు మిగుల్చుకుని అవ‌కాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి అంటే ఆ ద‌ర్శ‌కులకూ, ఆ స‌హ ద‌ర్శ‌కుల‌కూ మీరు చేసే సాయం ద‌గ్గ‌ర ఇంకా ఇంకా నేనెంతో ఆనందిస్తున్నాను. మ‌రి! మీరు కూడా ఆనందించాలి. ఆ గెలుపు వ‌ల‌న ద‌క్కిన ఫ‌లితం. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా తీసుకుని కొంద‌రు బ‌య్య‌ర్లు ఇప్ప‌టికీ డ‌బ్బులివ్వ‌లేద‌న్న వార్త ఎంత బాధించిందో ఈ వార్త ఆ బాధ‌ను దూరం చేస్తూ ఏం కాదు నాలుగు డ‌బ్బులున్నప్పుడే మ‌నం ఉన్నంత‌లో సాయం చేయ‌గ‌లం అన్నదే గుర్తుకువ‌చ్చింది. విన్న‌దేదో ఈ వేళ ఈ చేయూత‌కు మీకు ఉప‌క‌రించి ఉంటుంది. దేవుడు, మ‌తం ఈ వేళ చిన్నబోవాలి. లేదా సాయం అనే గొప్ప గుణం ద‌గ్గ‌ర మ‌రికొంద‌రు త‌మ‌ని తాము వెతుక్కోవాలి. పూరీ స‌ర్! ఇంకాస్త న‌చ్చారు.. కొన్ని ఓట‌ములు చుట్టుముట్టిన‌ప్పుడు మిమ్మల్ని నేను ప‌ట్టించుకోలేదు. అది నా త‌ప్పిదం కావొచ్చు.. అస‌లు కొన్ని సినిమాల విష‌య‌మై మీతో నేను విభేదించాను. కొన్ని సినిమా పోస్ట‌ర్ల‌ను కూడా చించేంత కోపం వ‌చ్చింది. ఇలా అంటే మీరు న‌వ్వుతారు. అవును! అది ఆయ‌న హక్కు మాట్లాడ‌నీయండి అని అంటారే కానీ అస్స‌లస్స‌లు కోపం కార‌న్నది నా వ‌ర‌కూ మీ గురించి తెలిసిన నిజం. అలానే ఇంకొంద‌రికి తెలియాల్సిన నిజం కూడా ఇదే! అవును ప్ర‌తిరోజూ నేను వెలువ‌రించే "మార్నింగ్ రాగా"లో ఓ మాట రాశాను రంగును ర‌ద్దు చేయండి - రూపం కాన‌గ‌ వ‌స్తుంది.. రూపం ర‌ద్దు చేయండి - నిలువు నామం కాన‌గ‌వ‌స్తుంది.. అది కూడా ర‌ద్దు చేయండి - వెలుగు కాన‌గ‌వ‌స్తుంది.. ఆ వెలుగే వేదం..మ‌రి! కాన‌గ రాని రూపం చెంత మ‌నుష్యు లంతా ఎందుక‌ని చిన్న‌బోతారో.. కొన్ని వేల సార్లు ఓడిపోతారో! సంపాదించడం ఖ‌ర్చు చేయ‌డం గ‌త కొద్ది రోజుగా ఆ ఉప్పుటేరు గాలుల చెంత మీరు చేస్తున్న ప‌ని. ఈ సారి ఈ పుట్టిన రోజున మీరు కాస్త ముంద‌డుగు వేసి సంపాదించిన రూపాయ‌లను అలా అలా అతి ఇష్టంగా పంచేస్తున్నారు. ఇక్క‌డే న‌చ్చారు.. ఇప్పుడే నచ్చారు ఇంకాస్త ఎక్కు వ‌గా మీరు క‌న్నీళ్ల‌ను వెచ్చించిన రోజులు తెల్సు. క‌ష్టం - న‌ష్టం - దుఃఖం ఈ మూడింటా మీరొక్క‌రే ఉన్న రోజులు ఆ గ‌ది గోడ‌ల సంబంధిత ఒంట‌రి త‌నాలూ సంబంధిత త‌న‌నాలూ తెల్సు.. ఇప్పుడిక అవేవీ వొద్దు.. మ‌ళ్లీ ఓడిపోండి.. మ‌నిషిగా ఇలానే ఇలానే ప్ర‌తి పుట్టినరోజున‌ మీరు ఎదిగి వ‌స్తే ఆనందిస్తాను. పండుగ అంటే ఇది క‌దా! కనుక ఇలాంటి అర్థం వ‌చ్చే వేడుక ఇక ఏటా ఆ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌ర‌గాల‌న్న‌ది నా ఆకాంక్ష.. మీ జ‌యాప‌జ‌యాలు, మీ..మీ..సినిమాల రికార్డులు - ప్ల‌కార్డులు - ప్లే కార్డుల గోల క‌న్నా ఈ రోజు మీరు అందిస్తున్న గొప్ప సాయం మా అందరికీ న‌చ్చింది.. గ్రేట్.. గ్రేట్ ..గ్రేట్ .. ల‌వ్యూ స‌ర్.. ఇట్లు ప్రేమాన్విత వ‌చ‌నంతో..వ‌ర్ఛ‌స్సుతో.. ర‌త్న‌కిశోర్ శంభుమహంతి


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33Zb3AA

No comments:

Post a Comment

This could be the date when Google launches Android 16 – and here's what's coming

An earlier launch for Android 16 was previously confirmed Now we may have an exact date: June 3 The OS will be ready in plenty of time ...