Friday, March 13, 2020

నిర్మాత పడకగదికి రమ్మన్నాడు... నటి సంచలన వ్యాఖ్యలు

మరోసారి సినీ ఇండస్ట్రీలో ఆరోపణలు‌ వినిపిస్తున్నాయి. తనకు కూడా అలాంటి వేధింపులు ఎదురయ్యాయంటూ తాజాగా ఓ నటి కీలక వ్యాఖ్యలు చేసింది. సీరియల్ యాక్టర్‌గా ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటి . మాయ అనే టీవీ సీరియల్ ద్వారా ఆమె నటిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘దైవమగళ్’ అనే సీరియల్‌లో ఆమె చేసిన సత్య అనే పాత్ర ద్వారా ఆమెకు గుర్తింపు లభించింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన వాణి 'ఓ మై కడవులే' చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే సక్సెస్‌ అందుకుంది. ప్రస్తుతం వైభవ్‌తో జతకట్టిన లాకప్‌ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఏదో ఓ వార్తల్లో ఈ నటి తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంది. గ్లామర్‌ విషయంలోనూ ఈ నటి కాస్త ఫాస్ట్‌. తన గ్లామరస్‌ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.... నెటిజన్ల నోట్లో నానుతూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకుంది. ఈ సందర్భంగా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధనం ఇస్తూ... తనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయంది. ఒక నిర్మాత అవకాశం కోసం పడక గదికి రమ్మన్నాడని చెప్పింది. అలాంటి అవకాశం తనకు అవసరం లేదని ఆ నిర్మాతకు చెప్పానంది. తాజాగా వాణిబోజన్‌ చేసిన కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ ఇప్పుడు కోలివుడ్‌లో హాట్ టాపిక్‌గా మరాయి. వాణిని బెడ్ రూంకు పిలిచిన ఆ నిర్మాత ఎవరంటూ కోలీవుడ్ అంతా ఆరా తీయడం మొదలు పెట్టింది. దీంతో మరోసారి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కలకలం రేపింది. వాణి బోజన్‌ సాధారణంగా తన మేనేజర్‌తోనే నిర్మాతలు సంప్రదిస్తారని తెలిపింది. అలా పలువురు నిర్మాతలు అవకాశాల కోసం తనను పడక గదికి పిలిచినట్లు మేనేజర్‌ తనకు చెప్పారని అంది. కాస్టింగ్‌ కౌచ్‌, మీటూ పేరుతో దేశ వ్యాప్తంగా సీని పరిశ్రమలో పెద్ద ఉద్యమమే మొదలయ్యింది. అప్పట్లో అనేకమంది నటీమణులు మీటూ పేరుతో తమ బాధలను వ్యక్తం చేశారు. తమకు ఎదురైన లైంగిక వేధింపుల విషయాల్ని బహిర్గతం చేశారు. ఇందులో బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ ఇలా పలు రాష్ట్రాలకు చెందిన సినీ పరిశ్రమకు సంబంధించిన అనేకమంది పెద్దల పేర్లు తెరపైకి వచ్చాయి. పలువురు నటీమణులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్,సింగర్ చిన్మయి కూడా మీటూపై పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే మీటూ ఉద్యమానికి బీజం పడిన హాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత హర్వే వీన్ స్టీన్‌కు ఓ నటిపై అత్యాచారం చేసిన కేసులో కోర్టు 24 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2vWTdBr

No comments:

Post a Comment

This ROG Xbox Ally deal might be your last chance at a gift before Christmas — it's almost 20% off on Amazon

Black Friday and Cyber Monday are long gone, but that doesn't mean winter sales are, and the Asus ROG Xbox Ally is fortunately on sale o...