Sunday, September 27, 2020

Drugs Racket: సారా, శ్రద్దా కపూర్ సంచలన ఆరోపణలు.. డ్రగ్స్ కేసులో సీక్రెట్స్ బయటపెట్టిన హీరోయిన్స్

బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో భాగంగా హీరోయిన్లు , , దీపికా పదుకొనేలు ఎన్సీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సుమారు ఐదు గంటలపాటు వీరిపై ప్రశ్నల వర్షం కురిపించగా సంచలన విషయాలు బయటపెట్టారని తెలుస్తోంది. తాజా ఇన్వెస్టిగేషన్‌లో ఈ హీరోయిన్లంతా మరణించిన సుశాంత్‌పైనే ఆరోపణలు చేస్తుండటం హాట్ ఇష్యూగా మారింది. సుశాంత్ డ్రగ్స్ అలవాట్లు సుశాంత్ షూటింగ్స్ మధ్యలోనే డ్రగ్స్ తీసుకునేవాడని, క్యారావాన్ లోకి వెళ్లి మాదకద్రవ్యాలు సేవించేవాడని సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ చెప్పినట్లు ఆంగ్ల మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. సుశాంత్ సింగ్ ఫామ్ హౌస్‌లో జరిగే పార్టీలకు కొందరు సినీ తారలు కూడా వచ్చేవారని శ్రద్దా, సారా అలీఖాన్ వెల్లడించినట్లు తెలుస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాకపోతే తాము మాత్రం డ్రగ్స్ తీసుకోలేదని ఆ ఇద్దరు హీరోయిన్స్ తెలిపారట. వాట్సాప్ చాట్ నిజమే కానీ.. మరోవైపు దీపికా పదుకొనే కూడా తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు అబద్ధమని.. ఆరోగ్య రీత్యా అలాంటి వాటికి దూరంగా ఉంటానని ఆమె వివరణ ఇచ్చినట్లు సమాచారం. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కన్నీరు పెట్టుకుందట దీపికా. అయినప్పటికీ వదలని ఎన్సీబీ ఆఫీసర్స్ లోతుగా ప్రశ్నించి ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయసాహాతో చేసిన వాట్సాప్ చాట్ నిజమే కానీ, తాను డ్రగ్స్ తీసుకోలేదని దీపికా వెల్లడించిందట. మొబైల్ ఫాన్స్ స్వాధీనం ఇప్పటికే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, దీపికా మేనేజర్ కరిష్మా ఫోన్లు స్వాధీనపర్చుకున్న ఎన్సీబీ అధికారులు.. శనివారం విచారణ అనంతరం సారా అలీఖాన్, శ్రద్దా కపూర్, దీపికా పదుకొనేల మొబైల్ ఫాన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ మొబైల్స్ చాట్ పరిశీలించి వారు ఇచ్చిన సమాచారం నిజామా? కాదా? అనేది తెలుసుకొని.. ఆ రికార్డ్ కోర్టుకు సబ్మిట్ చేస్తామని ఎన్సీబీ అధికారి అశోక్ జైన్ తెలిపారు. జుడీషియల్ కస్టడీలో రియా చక్రవర్తి సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటూ రియా చక్రవర్తి ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉంది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు ఆమెను విచారించిన పోలీసులు.. రియాను, ఆమె సోదరుడు షోవిక్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం డ్రగ్స్ కేసు వెలుగులోకి రావడంతో పలువురు డ్రగ్స్ పెడ్లర్స్‌ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సుశాంత్ డెత్ మిస్టరీ పక్కదారి పట్టిందా? ప్రస్తుత పరిణామాలు చూసి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు పక్కదారి పట్టిందా? ఆ డెత్ మిస్టరీని వదిలేసి డ్రగ్స్ అంశం తెరపై తెచ్చారని చెప్పుకుంటున్నారు జనం. డ్రగ్స్ కేసు విషయమై స్టార్ హీరోయిన్లకు సమన్లు జారీ చేసి విచారిస్తున్న నేపథ్యంలో సుశాంత్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ECHOej

No comments:

Post a Comment

Democrats neglect cyber but promise data privacy at DNC

The 2024 US Presidential election cycle has represented a shift in policy away from embracing technology, with both parties staying quiet o...