ప్రముఖ చెఫ్, మోడల్, టీవీ నటి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తన స్వస్థలమైన కేరళలోని కరువన్‌కోణంలోని తన నివాసంలో శవమై కనిపించారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో జాగీ ఫ్రెండ్ ఒకరు ఆమె ఇంటికి వెళ్లి చూడగా వంటింట్లో శవమై కనిపించారు. దాంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. జాగీ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ఆమె చావుకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినట్లు పేర్కొ్న్నారు. ‘ఆమె చావుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వేగంగా విచారణ జరుపుతున్నాం. మంగళవారం బాడీకి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. అప్పుడే ఆమె ఎలా చనిపోయారో తెలుస్తుంది’ అరి పేరూర్కడ పోలీసులు మీడియా ద్వారా వెల్లడించారు. జాగీ జాన్ తన తల్లి గ్రేసీతో కలిసి నివసిస్తున్నారు. జాగీ ఎలా చనిపోయిందో ఆమె తల్లికి కూడా తెలీకపోవడం గమనార్హం. పోలీసులు జాగీ తల్లి నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు యత్నిస్తున్నారు. కానీ ఆమె షాక్‌లో ఉండటంతో ఎవ్వరితోనూ మాట్లాడలేకపోతున్నారట. తన కూతురు వంటింట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని తెలిపారు. మరోపక్క జాగీ ఇంట్లో లేదని పని మీద బయటికి వెళ్లిందని తలాతోకా లేని సమాధానాలు చెబుతున్నారు. దాంతో ఆమె కాస్త కోలుకున్నాక పోలీసులు విచారిస్తారని తెలుస్తోంది. జాగీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ‘జాగీ కుక్ బుక్’ పేరుతో కుకరీ షోను కూడా ప్రారంభించింది. ‘కాక్ టెయిల్’, ‘లిటిల్ కుక్స్’, ‘చెఫ్’ తదితర కార్యక్రమాలకు హోస్ట్‌గానూ వ్యవహరించారు. క్రిస్మస్ సందర్భంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోను రెండు రోజుల క్రితమే జాగీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈలోగా ఇలా జరగడం బాధాకరం. సోషల్ మీడియాలో ఆమె చివరి వీడియో ఇదే
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SsoXqy
No comments:
Post a Comment