నందమూరి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రూలర్‌కు బాక్సాఫీస్ ముందు బోల్తా పడిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావటంతో నందమూరి అభిమానులు నిరాశలో మునిగిపోయారు. దీంతో బాలయ్య నెక్ట్స్ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే తదుపరి చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన బాలకృష్ణ వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బాలయ్య నెక్ట్స్ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. Also Read: ఈ సినిమా జనవరి 3న సెట్స్ మీదకు వెళ్లనుంది. రిజల్ట్‌తో సంబంధం లేకుండా బాలయ్య వెంటనే నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే బోయపాటి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశాడు. వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి 2020 వేసవిలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Also Read: లెజెండ్ సినిమా కోసం బాలయ్యకు విలన్‌గా టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబును దించిన బోయపాటి ఈ సారి మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో బాలయ్యకు ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సంజయ్‌దత్‌ను సంప్రదించారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సంజయ్ దత్, ప్రతినాయక పాత్రల్లోనూ నటిస్తున్నాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న కేజీఎఫ్ చాప్టర్ 2లో సంజూ బాబా విలన్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్న సంజయ్ దత్, బాలయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. అయితే రోల్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Qcofv7
No comments:
Post a Comment