Sunday, September 27, 2020

‘గంగవ్వ బిగ్ బాస్ కాంట్రాక్ట్ 2 నెలలు.. ఎలిమినేట్ కాదన్న విషయం ఆమెకూ తెలుసు.. కాని చాలా తెలివిగా’.. గుట్టు విప్పింది

బిగ్ బాస్ షో చూసేవాళ్లు పెర్ఫామెన్స్ చూసి భేష్ అనకుండా ఉండలేరు. బిగ్ బాస్ ఆటలో గేమ్ చేంజర్‌గా మారింది గంగవ్వ. తొలి వారం మొత్తం సప్పగా సాగిన ఆటను భుజాలపై వేసుకుని వారెవ్వా గంగవ్వా అనేట్టుగా తన యాస, భాషలతో ప్రేక్షకుల్ని అలరించి టాప్ రేటింగ్ కొల్లగొట్టింది. తొలివారమే ఆమె నామినేషన్స్‌లో ఉంటే 6 కోట్లకు పైగా ఓట్లు రాగా.. అందులో సగానికి సగం గంగవ్వకే వచ్చాయి అంటే గంగవ్వ హవా ఏ ఏంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్‌ ఉన్న వాళ్లలో చాలా మంది 25-30 ఏళ్ల మధ్య ఉన్న యంగ్ బ్యాచ్.. వీళ్లతో 63 ఏళ్లు పైబడిన గంగవ్వ ఎలా రాణిస్తుందని సందేహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పడు ఆమె రాణించడం కాదు.. ఆటను శాసిస్తోంది. బిగ్ బాస్ ఆటలో అందర్నీ వెనక్కి నెట్టి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యింది. ఈ వయసులో గంగవ్వ ఎనర్జీ, ఆట తీరు అద్భుతం.. అమోఘం ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. సీనియర్ సిటిజన్ అనే కార్డ్‌తోనే గంగవ్వ ఈ బిగ్ బాస్ ఆటలో రాణిస్తుందనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఆటలో గెలవడం కోసం కొంత మంది ఆట ఆడుతుంటే.. గంగవ్వ కోసమే ఆటాడే నటీనటులు బిగ్ బాస్ హౌస్‌లో చాలామందే ఉన్నారు. దర్శకుడు, ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్ అన్నట్టు సింపథీ కోసం గంగవ్వను బాగా చూసుకున్నట్టుగా చాలామంది నటిస్తున్నారని.. అది నిజంగా వచ్చే ప్రేమ కాదని చూసే జనానికి అర్థమౌతూనే ఉంది. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే రెండో వారంలో తాను బిగ్ బాస్ హౌస్‌లో ఉండలేకపోతున్నానని.. ఇక్కడ అసలు వాతావరణం పడటం లేదని.. మీ కాళ్లు మొక్కుతా బాంచన్ ఇక్కడ నుంచి పంపేయండి అంటూ కన్నీరు మున్నీరైంది గంగవ్వ. అయితే గంగవ్వతో మాట్లాడిన నాగార్జున.. నీ అన్నగా నేను చూసుకుంటా.. నువ్ ధైర్యంగా ఉండు.. అంటూ డాక్టర్‌ని పంపి ఆమెకు వైద్యం అందించారు. ఈ తరువాత గంగవ్వ కోలుకుంది.. రెట్టింపు ఉత్సాహంతో ఆటాడి బిగ్ బాస్ హౌస్‌ కెప్టెన్ అయ్యింది. అయితే గంగవ్వపై అతి ప్రేమ.. నామినేషన్ అప్పుడు సింపథీ.. కొన్ని టాస్క్‌లలో ఆమెకు మినహాయింపు.. ఇలా చాలా విషయాల్లో గంగవ్వ ఆట ఫెయిర్‌గా లేదనే విమర్శలు వస్తున్నాయి. సీనియర్ సిటిజన్ అనే కార్డ్‌తో గంగవ్వను విన్నర్ చేస్తే నిజంగా ఫెయిర్ గేమ్ ఆడుతున్న వాళ్ల పరిస్థితి ఏంటనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో అసలు గంగవ్వ బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతోందా?? ఎన్నాళ్లు ఆమె హౌస్‌లో ఉంటుంది?? కాంట్రాక్ట్ ఏమిటి? గంగవ్వ నిజంగానే ఏమీ తెలియకుండా ఆటాడుతోందా?? లేదంటే ఆమెకు అన్నీ తెలిసే గేమ్ ప్లాన్ వర్కౌట్ చేస్తుందా? అన్న విషయాలపై షాకింగ్ విషయాలను బయటపెట్టింది ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ . గంగవ్వ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘గంగవ్వ మనకు స్పెషల్ కంటెస్టెంట్ ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పిన మాట వాస్తవం.. దీంతో ఆమెకు సేవలు చేయడం ద్వారా సింపథీ పొందడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు.. వాళ్ల గేమ్‌లో గంగవ్వ కూడా ఒక పార్ట్. అయితే కొంతమంది రియల్‌గానే చేస్తున్నారు.. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్లంతా మాస్క్ పెట్టుకునే ఆడుతున్నారు.. పైకి ఒకలా లోపల ఒకలా ఉంటున్నారు. అలాగే గంగవ్వ కూడా. ఆమె బిగ్ బాస్ హౌస్‌కి ఎందుకు వచ్చాను.. ఏంటి?? అన్నది ఆమెకు పూర్తిగా తెలుసు.. ఆమె రెండు నెలలు ఉంటుందని ఆమెకూ తెలుసు. ఉండాలని ఆమె కూడా అనుకుంటున్నారు.. ఎందుకు అంటే ఆమె ఇళ్లు కొనుక్కోవాలని. అందుకోసం ఆమె గేమ్ చాలా జాగ్రత్తగా ఆడుతోంది. నిజానికి హౌస్‌లో గంగవ్వను ఎవరూ ఏమీ అనరు.. ఆమె కూడా ఎవర్నీ ఏమీ అనరు. ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు.. నామినేట్ అయినా ఎలిమినేట్ కారు. కొన్నివారాల పాటు ఆమె సేఫ్.. ఆ విషయం ఆమెకు తెలుసు. కాని.. ఆమె నేను పోతా పోతా అంటుంది కాని ఆరోగ్యం బాలేకపోతే తప్పితే బయటవెళ్లనని ఆమెకు కూడా తెలుసు. బయటకు వెళ్తా అంటుంది కాని.. ఆమె ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు వెళ్లే ఛాన్స్ లేదు. అందుకే నేను ఆమెకు గేమ్ ప్లాన్ తెలిసి కూడా.. నేను వెళ్తా వెళ్తానని అనడంతో ఆమె చాలా జాగ్రత్తగా తెలివిగా ఆడుతున్నారని అన్నాను. ఆ హౌస్‌లోకి వెళ్తే ఎవరికైనా మాస్క్ వస్తుందని.. గంగవ్వ కూడా మాస్క్ ధరించే ఆడుతుంది’ అంటూ గంగవ్వ గుట్టు విప్పింది కరాటే కళ్యాణి. అయితే గంగవ్వ బిగ్ బాస్ కాంట్రాక్ట్ 2 నెలలైతే.. ఈ రెండు నెలలు అయిన తరువాత ఆమెను బయటకు పంపుతారా?? లేదంటే మధ్యలో ఆమె నామినేషన్‌లోకి వచ్చినా ఎలిమినేట్ చేయరా? అసలు గంగవ్వ తన ఆట తనే ఆడుతుందా? లేక బిగ్ బాస్ ఆడిస్తున్నాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఎలాగైనా ఈ వయసులో యువతీయువకులతో పోరాడుతూ బిగ్ బాస్ ఆటాడటం గంగవ్వకే చెల్లింది. ఆమెకు విజయం వరించాలనే కోరుకుందాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kVwfhx

No comments:

Post a Comment

Grok's mobile app is here – and it might not be very careful

There's a mobile app for Grok rolling out from xAI on iOS. The standalone app marks a major step in taking the bot beyond the confines...