Wednesday, September 2, 2020

SSR Case: సుశాంత్ సూసైడ్ కేసులో కీలక ఆధారాలు.. తొలి అరెస్ట్.. మరింత ఇరకాటంలో రియా!

బాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య కేసు ఓ మిస్టరీని తలపిస్తోంది. తన ఇంట్లోనే సుశాంత్ బలవన్మరణానికి పాల్పడటంపై పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు ముంబై పోలీసులు. ఆ తర్వాత ఈ కేసు ఊహించని మలుపులు తిరగడం, తవ్వుతున్నా కొద్దీ ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వస్తుండటంతో చివరకు సీబీఐ కూడా రంగంలోకి దిగి సుశాంత్ సూసైడ్ కేసును చేధించే పనిలో నిమగ్నమైంది. అయితే కేసు దర్యాప్తులో భాగంగా సుదీర్ఘ విచారణ అనంతరం తొలి అరెస్టు నమోదైంది. ఇప్పటికే సుశాంత్‌తో సంబంధం ఉన్న 50 మందిని విచారించిన ముంబై పోలీసులు.. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని కీలకంగా తీసుకొని ఆధారాలు సేకరిస్తున్న క్రమంలో డ్రగ్స్ వ్యవహారం బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే అలర్ట్ అయిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగి నిన్న (బుధవారం) ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ కాబడిన ఆ ఇద్దరూ ముంబైలో జరిగే పార్టీలకు అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ సప్లై చేసేవారని, ఒక్కో గ్రాముకు 5000 రూపాయలు వసూలు చేసేవారని తెలిపారు ఎన్‌సీబీ అధికారులు. Also Read: అయితే ఆ ఇద్దరిలో ఒకరైన అబ్దుల్ బాసిత్‌కు సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉందని ఎన్‌సీబీ వెల్లడించడం సుశాంత్ కేసులో కీలక ఆధారంగా మారింది. సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో బాసిత్‌కు సంబంధం ఉందని, అలాగే సోదరుడు షోవిక్ సూచనల మేరకు బాసిత్‌ నుంచి మిరాండా డ్రగ్స్ తీసుకునేవాడని ఎన్‌సీబీ పేర్కొనడం సుశాంత్ ప్రేయసి రియాను మరింత ఇరకాటంలో పడేసింది. గతేడాది సుశాంత్ ఇంట్లో శామ్యూల్ మిరాండాను మేనేజర్‌గా నియమించింది రియానే. అప్పటి నుంచి సుశాంత్‌కి సంబంధించిన అన్ని వ్యవహారాలు మిరాండానే స్వయంగా చూసుకునేవాడు. ఈ నేపథ్యంలో మిరాండాకు డ్రగ్స్ సప్లై చేసేవారితో లింక్స్ ఉన్నాయని ఎన్‌సీబీ పేర్కొనడం సంచలనంగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32Y2HZE

No comments:

Post a Comment

This AI tool lets you confront your future self – and you might like what you find

Imagining what you'll be like in the future is a common game for kids, full of the sometimes unlikely hopes and fears we all feel when ...