Wednesday, September 2, 2020

ఆదిపురుష్ అప్‌డేట్.. అనుకున్నట్లే రావణాసురుడి రోల్ రివీల్.. బాలీవుడ్ హీరోతో భారీ స్కెచ్

ఎవ్వరూ ఉహించని విధంగా భారీ ప్రాజెక్టు 'ఆదిపురుష్' ప్రకటించి తన అభిమానుల్లో నూతనోత్సాహం నింపిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ సినిమా విడుదలయ్యే వరకూ అదే స్ట్రాటజీ ఫాలో అయ్యేలా కనిపిస్తున్నారు. ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాలేదు అప్పుడే మరో అప్‌డేట్ ఇచ్చి సర్‌‌ప్రైజ్ చేశారు ప్రభాస్. నుంచి రేపు (సెప్టెంబర్ 3) రేపు ఉదయం 7:11 గంటలకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నామంటూ ఒకరోజు ముందుగానే ప్రకటించిన అండ్ టీమ్ సరిగ్గా చెప్పిన సమయానికి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చి సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టారు. Also Read: ‘‘7000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ఉండేవాడు!’’ అని పేర్కొంటూ ఆసక్తిరేకెత్తించిన చిత్ర యూనిట్.. ఆ రాక్షసుడు ఎవరు? ఆ రోల్ ఏ స్టార్ పోషిస్తున్నారనే విషయం రివీల్ చేశారు. ఇప్పటికే శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసిన మేకర్స్ తాజాగా తెలివైన రాక్షసుడు రావణాసురుడి పాత్రను పరిచయం చేశారు. ఈ చిత్రంలో లంకేష్ రోల్ బాలీవుడ్ స్టార్ నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పది తలల రావణాసురుడిని చూపిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే వెండితెరపై ప్రభాస్- సైఫ్ అలీ ఖాన్ పోరు ఆవిష్కృతం కానుందన్నమాట. తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ 'ఆదిపురుష్' మూవీని భారీ బడ్జెట్ కేటాయించి పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. గుల్షన్ కుమార్, టి-సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓం రౌత్, క్రిషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ సహ నిర్మాతలు. 3D మూవీగా రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్ 2021 ఆరంభంలో స్టార్ట్ చేసి 2022లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bkrVF4

No comments:

Post a Comment

This AI tool lets you confront your future self – and you might like what you find

Imagining what you'll be like in the future is a common game for kids, full of the sometimes unlikely hopes and fears we all feel when ...