'రంగస్థలం' లాంటి భారీ హిట్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. 'పుష్ప' మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. హీరోగా రూపొందుతున్న ఈ మూవీలో క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. తన క్రియేటివిటీకి పదును పెడుతూ ఈ మూవీపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట సుకుమార్. ఇండస్ట్రీ హిట్ సాధించి గత రికార్డులు తిరగరాయని ఆయన స్కెచ్ వేశారట. ఇక ఈ మూవీలో తన రెగ్యులర్ ఫార్మాట్ లోనే ఐటెం సాంగ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉండాలని ఆయన ఫిక్స్ అయినట్లు సమాచారం. సుకుమార్ మూవీ అంటే అందులో ఐటెం సాంగ్ గ్యారెంటీ. అదికూడా సగటు ప్రేక్షకుడు ఓ 5 నిమిషాల పాటు మైమరచిపోయేలా ఉంటుంది. అదే బాటలో 'పుష్ప' సినిమాలో కూడా మంచి ఐటెం సాంగ్ రెడీ చేసి పెట్టారట సుక్కు. షూటింగ్‌లో డాన్స్ ఫ్లోర్, విడుదలయ్యాక థియేటర్స్ దద్దరిల్లేలా ఈ సాంగ్ మేకింగ్ జరగాలని స్కెచ్ వేశారట. ఇక ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో చిందేసేందుకు కొందరు బాలీవుడ్ భామల పేర్లు పరిశీలించిన సుక్కు.. చివరకు హాట్ బ్యూటీ వైపు మొగ్గినట్లు తెలుస్తోంది. ఆమె హాట్ హాట్ అందాల మడమ స్టైలిష్ స్టార్ మెరుపులు మెరిపించే స్టెప్స్ చూసి ఆడియన్స్ ఉగిపోవాల్సిందే అని సుకుమార్ డిసైడ్ అయినట్లు ఇన్‌సైడ్ టాక్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ పూర్తి మాస్ రోల్ పోషిస్తున్నారు. లారీ డ్రైవర్‌గా అల్లు అర్జున్ కనిపించనున్నారని తెలిసింది. ఇటీవలే విడుదలైన 'పుష్ప' ఫస్ట్‌లుక్ ఆయన రోల్ ఎలా ఉండనుందో చెప్పకనే చెప్పేసింది. తన సినిమాల్లో హీరోయిన్‌ని కూడా హీరోతో సమానంగా ఎలివేట్ చేసే సుక్కు.. పుష్పలో రష్మిక రోల్ కూడా అదే రేంజ్‌లో రాసుకున్నారట. ఇన్నాళ్లు బ్యూటిఫుల్ హీరోయిన్‌గా కనిపించిన రష్మికను మాస్ క్యారెక్టర్‌లో గిరిజన యువతిగా చూపించనున్నారట సుకుమార్. ప్యాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో 'పుష్ప' చిత్రాన్ని విడుదల ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ ఫినిష్ చేసుకొని లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ తదుపరి షెడ్యూల్స్ త్వరత్వరగా ఫినిష్ చేసి బన్నీ అభిమానుల ముందు మరో బిగ్గెస్ట్ హిట్ ఉంచాలని చూస్తున్నారు సుకుమార్. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WfTE2N
No comments:
Post a Comment