Saturday, May 30, 2020

మీరే నా సూపర్ స్టార్.. కృష్ణ పుట్టినరోజున మహేష్ బాబు ట్వీట్

టాలీవుడ్ నటశేఖరుడు, ఘట్టమనేని ఇవాళ 77వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అభిమానుల్ని అలరించారు. తెలుగు చలన చిత్ర సీమలో గ్లామరస్‌ నటుడు కృష్ణ. వెండితెరపై మెరిసిన అందగాడు. అలాంటి టాలీవుడ్ స్టార్ కృష్ణకు కళాప్రపూర్ణ పురస్కారం వరించింది. తెలుగు చలన చిత్ర సీమకు ఆయన చేసిన సేవకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి సత్కరించింది.ఇవాళ కృష్ణ బర్త డే సందర్భంగా ఆయన తనయుడు మహేష్ బాబు, కోడలు నమ్రత, మనవరాలు సితారతో పాటు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బర్త్ డే శుభాకాంక్షలు నాన్న.. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఎప్పటికీ నా సూపర్ స్టార్ అంటూ చేశారు. తన తండ్రితో చిన్నప్పుడు దిగిన ఫోటోని కూడా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో కృష్ణ ఫోటో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే తాత గారు.. లవ్ యూ వెరీ మచ్.. ఈ రోజు మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని విషెస్ తెలిపింది. ఈ రోజు సందర్భంగా మహేష్ 27వ చిత్రం లాంచ్ కానుంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సర్కార్ వారి పాట అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మహేష్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MdDKRZ

No comments:

Post a Comment

This is the fastest 2TB memory card ever launched and I can't wait to test it

TeamGroup T-Create Expert SDXC card is the second SD card to hit 2TB Launch comes months after the firm also revealed a 2TB microSD card...