Saturday, May 30, 2020

మహేష్ మెడ మీద రూపాయి బిల్ల.. సర్కార్ వారి పాట లుక్ అదుర్స్

మహేష్ బాబు షూరూ అయ్యింది. మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా ప్రకటించాడు. తన కొత్త సినిమా సర్కార్ వారి పాట మరో బ్లాక్ బస్టర్ మూవీ హ్యాట్రిక్ కొట్టేందుకు వస్తుందంటూ మహేష్ ట్వీట్ చేశాడు. సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందులో మహేష్ లుక్ అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్. చెవి పోగు, మెడపై రూపాయి కాయిన్ టాటూతో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో మహేష్ లుక్ కేక పెట్టాలా కనిపిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం తండ్రి పుట్టిన రోజున మహేష్ తన అభిమానులకు శుభవార్త అందించాడు. తన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా అందించాడు. మహేష్ బాబు తన 27వ సినిమా అయిన ‘సర్కార్ వారి పాట’ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోతోంది. ‘గీత గోవిందం’ ఫేం పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ మహేశ్‌ తండ్రి, సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు శుభవార్త చెప్పారు. జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంస్థలు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియలేదు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ పనిచేస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ ఎంతగా హిట్ అయ్యిందో తెలిసిందే. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలోనే మహేశ్‌ హిట్‌ అందుకున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయన మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు ముందు మహేష్ చేసిన మహర్షి, భరత్ అనే నేను సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మహర్షి సినిమా కూడా మహేష్ ఇమేజ్‌ను మరింత పెంచింది. దీంతో ఇప్పుడు సర్కార్ వారి పాట అనే పేరుతో మరో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించేందుకు టాలీవుడ్ ప్రిన్స్ ప్లాన్ చేస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3chMSQ6

No comments:

Post a Comment

Want a first look at Christopher Nolan’s The Odyssey? There's currently only one place to see the trailer

The Odyssey has a confirmed release date of July 17, 2026 The date was confirmed in a new poster No trailer has been officially release...