యంగ్ టైగర్ హీరోగా రూపొందుతున్న తాజా సినిమా RRR. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను భారీ రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లో 29వ మూవీగా ఈ సినిమా రాబోతోంది. అయితే ఈ మూవీ చేస్తుండగానే మాటల మాంత్రికుడు శ్రీనివాస్ దర్శకత్వంలో తన 30వ సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు ఎన్టీఆర్. కాగా ఈ మూవీని అతిత్వరలో సెట్స్ మీదకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్న త్రివిక్రమ్.. నందమూరి అభిమానులను టెన్షన్ పెట్టిస్తున్న ఓ విషయంపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. ఆ టెన్షన్ వీగిపోయేలా పక్కా ప్లాన్‌తో రెడీ అయ్యారని టాక్. రాజమౌళితో చేసిన వెంటనే మళ్ళీ అదే హీరో వెంటనే హిట్ కొట్టిన సందర్భాలు లేవు. మొన్న ప్రభాస్ విషయంలోనూ ఇదే ప్రూవ్ అయింది. దీంతో ఈ విషయమై నందమూరి ఫ్యాన్స్ బెంగ పెట్టుకున్నారు. తమ అభిమాన హీరోకి కలిసొస్తుందా? లేదా? అనే డైలామాలో పడ్డారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు గ్రహించిన త్రివిక్రమ్ తన కథను మరింత సానబట్టి జనాల్లో అలాంటి సెంటిమెంట్ పారద్రోలేలా స్కెచ్ వేస్తున్నారట. RRR తర్వాత ఎన్టీఆర్ చేయబోయే ఈ మూవీ భారీ హిట్ సాధించేలా సన్నివేశాలు రాసుకున్నారట. ఈ టాక్ విని నందమూరి ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. నందమూరి అభిమానులకు కిక్కిచ్చే మరో విశేషం ఏమిటంటే.. త్రివిక్రమ్ రూపొందించబోతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించబోతున్నారని తెలుస్తుండటం. రాజకీయ నేపథ్యంలో ఈ మూవీ సాగిపోనుందని సమాచారం. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు. ఇకపోతే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారని, అందులో ఒకరు సమంత అనే ఆసక్తికర విషయం ఎన్టీఆర్ అభిమానులను ఖుషీ చేస్తోంది. సో.. త్రివిక్రమ్ ఏ రేంజ్‌లో ప్లాన్ చేశారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cpWQPv
No comments:
Post a Comment