Sunday, May 31, 2020

పూరి కథ కోసం ఎదురుచూస్తున్నా.. మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మహేష్ బాబు- క్రేజీ కాంబోలో సినిమా రావాలని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు ''పోకిరి, బిజినెస్‌మేన్'' సూపర్ డూపర్ హిట్స్ సాధించడంతో మళ్ళీ ఇప్పుడు అందరి చూపు ఈ కాంబోపై పడింది. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే మరి కొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల కోరిక నెరవేరుతుందేమో అనిపిస్తోంది. నిన్న విడుదలైన మహేష్ కొత్త సినిమా టైటిల్ పోస్టర్ 'సర్కార్ వారి పాట' చూసి పూరి జగన్నాథ్ అభినందించడం, మరోవైపు కాసేపు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడిన .. పూరితో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం సూపర్ స్టార్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతోంది. నిన్న (మే 31) సూపర్ స్టార్ కృష్ణ 77వ పుట్టిన రోజు సందర్భంగా ఇన్స్‌స్టా వేదికగా అభిమానులతో లైవ్ చాట్ చేశారు మహేష్ బాబు. ఈ కార్యక్రమంలో అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? దానికోసం మేము ఎంతగానో ఎదురుచూస్తున్నాం అని అడగగా మహేష్ ఆసక్తికరంగా స్పందించారు. ఖచ్చితంగా పూరి దర్శకత్వంలో సినిమా చేస్తానని, తనకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరని, ఆయన కథ నేరేట్ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నానని చెప్పారు. దీంతో పూరి- మహేష్ కాంబోకి త్వరలోనే ముహూర్తం పెట్టడం ఖాయమని ఫిక్స్ అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు. Also Read: ఇకపోతే ఈ ఏడాది ఆరంభం లోనే 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకుంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టేసిన మహేష్ బాబు.. ఇప్పుడు 'సర్కార్ వారి పాట' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను అతిత్వరలో సెట్స్ పైకి తీసుకురానున్నారు. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ మూవీ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. సో.. చూడాలి మరి ఇంతటి బిజీ షెడ్యూల్‌లో పూరి జగన్నాథ్ తన కథతో మహేష్ డేట్స్ పట్టేస్తాడా? లేదా? అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36OMyHt

No comments:

Post a Comment

This is the fastest 2TB memory card ever launched and I can't wait to test it

TeamGroup T-Create Expert SDXC card is the second SD card to hit 2TB Launch comes months after the firm also revealed a 2TB microSD card...