Saturday, May 30, 2020

వలస కార్మికుల కోసం విమానం.. సోనూ సూద్ ‌పై సీఎం ప్రశంసలు

కరోనా లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు వెతలు పడుతున్న వేళ వారి పాలిట దైవంలా దిగివచ్చాడు... ప్రముఖ స్టార్ సోనూ సూద్. సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించిన.. సోనూ నిజ జీవితంలో మాత్రం నిజంగా హీరో అయ్యాడు. ఆయన వలస కార్మికుల కోసం చేసిన సాయం ఏ ఒక్క భారతీయుడు మరిచిపోలేనిది. సొంత రాష్ట్రాలకి వెళ్ళేందుకు ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఎందరో వలస కార్మికులు కాలి బాట పట్టారు. వీరిని చూసి చలించిన తన శక్తివంచన మేరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాడు. వేలాది మంది వలస కార్మికులని సొంత గూటికి చేర్చారు. ఇటీవల కేరళలో చిక్కుకుపోయిన ఒడిశా యువతులను ప్రత్యేక ఫ్లైట్ ద్వారా స్వస్థలానికి చేర్చారు. కేరళలోని ఎర్నాకుళంలో కుట్టుమిషన్ల కంపెనీలో పనిచేస్తున్న 177 మంది మహిళలు తమ సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లాలంటూ సోనూసూద్‌ను సాయం కోరారు. ఆ విషయం తెలిసిన వెంటనే వారి కోసం ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాడు. తాజాగా సోనూ సూద్ చేసిన ఈ పనిని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆపత్కాలంలో సోనూ చేస్తున్న సేవలకు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా సోనూ సూద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సోనూను ప్రశంసించారు. ''ఒడిశా మహిళలకి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌కు ధన్యవాదాలు. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా కేరళలో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు చొరవ చూపారు. ఆయన మానవతాదృక్పథాన్ని ప్రశంసించి తీరాల్సిందే''అని ట్వీట్‌ చేశారు. సీఎం పట్నాయక్ ట్వీట్‌కి సోనూ సూద్ కూడా స్పందించారు. కేరళలో చిక్కుక్కుపోయిన నా అక్కా చెల్లెళ్ళని ఇంటికి పంపండం నా బాధ్యతగా భావించాను. మీ మాటలు నాలో స్పూర్తిని నింపాయి. ధన్యవాదాలు సార్. దేశంలోని వలస కార్మికులని వారి స్వస్థలాలకి పంపేందుకు నేనే ఎల్లప్పుడు సిద్ధంగానే ఉంటాను అని బదులిచ్చారు సోనూ. కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్ కార్మికులను ఇప్పటివరకు సోనూసూద్ ఇంటికి పంపించారు. ఈ కార్యక్రమంలో అతని కుటుంబం,స్నేహితులు సైతం అతనికి అండగా నిలిచారు. తనకు ప్రశంసలు అవసరం లేదని.. ప్రజల ఆశీర్వాదమే చాలని అంటున్నారు సోనూ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2B9Q2Z5

No comments:

Post a Comment

Spotify’s latest breakout band The Velvet Sundown appears to be AI-generated – and fans aren’t happy

Update, Thursday July 3: In a further twist to the story of The Velvet Sundown, we've been contacted by a representatives of the band ...