టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ 77వ బర్త్ డే నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ మధ్యే సోషల్ మీడియాలోకి వచ్చిన మెగాస్టార్ .. యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రతీ సందర్భంపై ఆయన స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి..కృష్ణకు పుట్టినరోజు విషెస్ తెలిపారు. కృష్ణతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ స్పెషల్ విషెస్ అందించారు. కథానాయకుడిగా 345 సినిమాలు దర్శకుడిగా 14 చిత్రాలు.నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు.మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే.మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే.అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెంలో 1942 మే 31న జన్మించారు. కృష్ణ హీరోగా చేసిన మొట్ట మొదటి సినిమా ‘తేనే మనసులు’. ఆ సినిమా నాటికే ఆయనకు ఇందిరతో పెళ్లి అయ్యింది. ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ కెరీర్ మలుపుతిప్పింది. ఇది తొలి తెలుగు జేమ్స్‌బాండ్ తరహా సినిమా. కృష్ణకు ప్రేక్షకుల్లో ఆంధ్రా జేమ్స్‌బాండ్ అన్న పేరు వచ్చింది. ఈ విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యాడు. 1965 అక్టోబర్ 13 నాటికి పెద్ద కొడుకు రమేష్ బాబు పుట్టాడు. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసి, ప్రస్తుతం సినిమా నిర్మాణం చేస్తున్నాడు. చిన్న కొడుకు మహేష్ బాబు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నటునిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. మహేష్ తండ్రి కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని మహేష్ కీలక ప్రకటన చేశారు. మహేష్ బాబు తన 27వ సినిమా అయిన ‘సర్కార్ వారి పాట’సినిమా టైటిల్‌తో పాటు తన ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ముందుగా ప్రచారం అయినట్టు ఈ మూవీకి సర్కారు వారి పాట అనే టైటిల్ నిర్ణయించారు. చెవికిపోగు, మెడపై రూపాయి నాణెం టాటూ తో మహేష్ సరికొత్త లుక్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహేష్ ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో మహేష్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ అలాగే 14 రీల్స్ కలిసి నిర్మించనున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zDpNdr
No comments:
Post a Comment