Wednesday, July 29, 2020

Bandla Ganesh: కోడి గుడ్లు తినండి సార్.. రాజమౌళికి బండ్ల గణేష్ భరోసా! ఏంటండీ ఇక్కడ కూడా!!

దేశంలో మహమ్మారి వీర విజృంభణ చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ కరోనా బారిన పడుతుండటం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సినీ పరిశ్రమలో చాలామందికి సోకుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే నిన్న (బుధవారం) దర్శకధీరుడు తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ అయినట్లుగా పేర్కొంటూ ట్వీట్ చేయడంతో టాలీవుడ్ లోకం ఉలిక్కిపడింది. దాంతో పలువురు సినీ ప్రముఖులు రాజమౌళి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. కాగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపిన రాజమౌళి.. ‘‘నా కుటుంబ సభ్యులకు, నాకు కొన్ని రోజులు క్రితం కాస్త జ్వరం వచ్చింది. దానికదే తగ్గిపోయింది. కానీ, మేం పరీక్ష చేయించుకున్నాం. ఈ రోజు వచ్చిన ఫలితాల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలింది. డాక్టర్ల సూచన మేరకు మేమంతా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాం. ప్రస్తుతం మాకు ఎలాంటి లక్షణాలు లేవు. అంతా బాగానే ఉన్నాం. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డాక్టర్ల సూచనలు పాటిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దీని వల్ల మేం ప్లాస్మా దానం చేయగలుగుతాం’’ అని పేర్కొన్నారు. Also Read: ఈ నేపథ్యంలో గతంలో కరోనాను జయించిన రాజమౌళికి ధైర్యం చెబుతూ ట్వీట్ పెట్టి అందరినీ ఆకర్షించారు. సార్.. కరోనా సోకిందని భయపడాల్సిన అవసరం లేదంటూ సింపుల్‌గా చెప్పేశారు. ఈ మేరకు.. ''ఏమీ కాదు.. సంతోషంగా, హాయిగా ఉండండి సార్. ప్రతి రోజు కోడి గుడ్లు తినండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. ప్రశాంతంగా నిద్రపోండి'' అని ట్యాగ్ చేశారు బండ్ల గణేష్. ఆయన పెట్టిన ఈ ట్వీట్ చూసి డైరెక్టర్ రాజమౌళి కరోనాను జయించాలని కోరుకుంటూనే ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ''ఏంటండీ.. ఇక్కడ కూడా పౌల్ట్రీ ఫామ్ ప్రమోషన్స్ చేస్తున్నారా?'' అనే కామెంట్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3feoUqh

No comments:

Post a Comment

Amazon Great Freedom Festival Sale: Top Deals on OnePlus 13R, Nord 5, Nord CE 5, and More OnePlus Smartphones

Amazon Great Freedom Festival 2025 began on July 31 at noon for everyone in India. It enables shoppers to avail of hefty discounts on a wide...