Monday, July 27, 2020

రామ్ గోపాల్ వర్మకు జీహెచ్ఎంసీ జరిమానా

రామ్ గోపాల్ వర్మకు ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా వేసిన పోస్టర్‌కు సంబంధించి జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం వర్మకు రూ.4వేల పెనాల్టీ విధించింది. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి పోస్టర్‌గా పేర్కొంటూ ‘పవర్‌ స్టార్‌’ సినిమాకు సంబంధించి రామ్‌గోపాల్‌వర్మ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ నెటిజన్ ఒకరు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. సినిమాను ప్రమోట్‌ చేసేందుకు ప్రభుత్వ ఆస్తిని వినియోగించినందున ఫైన్‌ వేయాల్సిందిగా ఈవీడీఎం విభాగానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈవీడీఎం విభాగం వర్మకు ఈనెల 22వ తేదీన రూ.4వేలకు ఈ చలానా జారీ చేసింది. Read More: తాజాగా ‘పవర్ స్టార్’ సినిమా తీసిన వర్మ దాన్ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ‌పైనే ఆ సినిమా అంటూ వర్మ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. కేవలం 37 నిమిషాల విడిదితో వర్మ సినిమా తీశాడు. దీనిపై పవన్ ఫ్యాన్స్ మండిపడ్డారు. అతనిపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాడని అందరూ అనుకున్నారు. ఐతే ఈ సినిమాలో అలాంటి పర్సనల్ అటాక్స్ ఏమి ఉండవు. ఎన్నిక ఫలితాల తరువాత ప్రవన్ కళ్యాణ్ అనే ఓ స్టార్ కమ్ పొలిటీషియన్ అనుభవించిన మానసిక వేదన ఈ సినిమాలో తెలియజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39wBaB8

No comments:

Post a Comment

This Cooler Master shark-shaped gaming PC case is the coolest thing we’ve seen all week, but it’ll cost you

Back during CES 2023, Cooler Master unveiled a gorgeous – and unbelievably expensive – gaming PC that’s shaped like a shark . But now, if y...