Friday, July 31, 2020

అనుష్కకు అస్సలు ఇష్టం లేదట.. అందుకే నో అనేసింది! స్వీటీ భయం అదే..

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ భారీ రెమ్మ్యూనరేషన్ ఆఫర్ కూడా తిరస్కరించిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా కారణంగా థియేటర్స్ బంద్ కావడం, ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో డిజిటల్ వేదికలకు డిమాండ్ పెరిగింది. దీంతో స్టార్ హీరోహీరోయిన్లు, స్టార్ డైరెక్టర్లు సైతం వెబ్ సిరీస్‌లు రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ భారీ వెబ్ సిరీస్ కోసమై అనుష్కను సంప్రదించగా ఆమె సున్నితంగా 'నో' అనేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎంటర్టైన్‌మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటీటీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మాంచి ఫామ్‌లో ఉన్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు ఓటీటీ ద్వారా విడుదలై సక్సెస్ అయ్యాయి. అగ్ర తారలు సైతం ఓటీటీ వైపు చూస్తుండటంతో సౌత్ ఇండియన్ క్రేజీ హీరోయిన్ అనుష్కతో భారీ వెబ్ సిరీస్ చేసేలా ప్లాన్ చేసిందట ఓ ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్. వివిధ భాషల్లో ఏకకాలంలో నిర్మితమయ్యే ఈ సిరీస్ కోసం అనుష్క అయితేనే బెటర్ అని భావించిన నిర్మాతలు ఆమెను సంప్రదించి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. అయినప్పటికీ దానిని ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. Also Read: అయితే అనుష్క ఈ భారీ వెబ్ సిరీస్‌పై ఆసక్తి కనబర్చకపోవడానికి ఆమె భయమే కారణం అనే టాక్ వినిపిస్తోంది. ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల రీచ్ తక్కువగా ఉంటుందని, అలాగే వెబ్ సిరీస్‌ల్లో నటిస్తే పాపులారిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుందని ఆమె భావిస్తోందట. ఆ కారణంగానే అనుష్క నో చెప్పిందని అంటున్నారు. కాగా అనుష్క లేటెస్ట్ మూవీ 'నిశ్శబ్దం' ఓటీటీలోనే విడుదల కానుంది. అయితే దీనికి కూడా తప్పని పరిస్థితుల్లో అయిష్టంగానే అనుష్క ఒప్పుకున్నట్లు సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39ImJKy

No comments:

Post a Comment

This Meta prototype is a seriously upgraded Meta Quest 3 – and you can try it for yourself

Meta has two new VR headsets you can try They're protypes that aren't usually accessible to the public You'll have to attend...